జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

అమెరికన్ పాపులర్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయించిన కంపాస్ ఎస్‌యూవీలో తలెత్తబోయే చిన్నపాటి సమస్య కారణంగా సుమారు 547 యూనిట్ల వాహనాలను రీకాల్ చేసింది. వైపర్ అసెంబ్లీలో ఉపయోగించే బ్రేస్ నట్ సమస్యను సరిదిద్దడానికి ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా 2020 మోడల్ ఇంయర్ జీప్ కంపాస్ కార్లను వెనక్కు పిలిపిస్తున్నట్లు ప్రకటించింది.

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

క్వాలిటీ చెక్‌లో భాగంగా వాహనాన్ని ఆడిట్ చేసేటప్పుడు ఎమ్‌వై 20 (మోడల్ ఇయర్ 2020) జీప్ కంపాస్‌ కార్లలోని వైపర్ బ్రేస్ నట్ అమరికను మెరుగుపరిచే అవకాశాన్ని తాము గుర్తించామని కంపెనీ పేర్కొంది. ఈ రీకాల్‌కు గురైన వాహనాలు అన్నీ కూడా 2020 సంవత్సరంలో తయారు చేయబడినట్లు జీప్ తెలిపింది.

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ప్రకటన సారాంశం ఇది. "టార్క్-ఇండ్యూస్డ్ బ్రేస్ నట్ వైపర్ పివోట్ అసెంబ్లీలో వైపర్ ఆర్మ్‌ని గట్టిగా బిగించి ఉండాలి, అలా ఉంటే వైపర్ అటూ ఇటూ కదలడం జరుగుతుంది. ఈ నట్ లోపం కారణంగా, స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న వైపర్ కాంబో-స్విచ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు వైపర్ స్వివ్లింగ్ ఫంక్షన్ పనిచేయకుండా పోయే అవకాశం ఉంది."

MOST READ:మరోసారి కరోనా లాక్‌డౌన్ ఉల్లంఘించి రోడ్ షో చేసిన బిజినెస్ మ్యాన్, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

బ్రేస్ నట్‌ను బిగించడం వలన వైపర్ పివోట్ వద్ద గ్రిప్ మెరుగుపడుతుందని, పనిచేయకుండాపోయే అవకాశం తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది. స్థిరమైన వైపర్ ఫంక్షన్లకు బ్రేస్ నట్ సవరణ అవసరమని కంపెనీ తెలిపింది.

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

కాగా, ఇప్పటి వరకూ ఎమ్‌వై20 జీప్ కంపాస్ యజమానులు తమ వాహనాల్లో ఇలాంటి సమస్య గురించి ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవలని, క్వాలిటీ చెక్‌లో భాగంగా తామే ఈ విషయాన్ని గుర్తించామని కంపెనీ పేర్కొంది.

MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

రీకాల్‌కు గురైన ఎమ్‌వై20 జీప్ కంపాస్ మోడల్ యజమానులకు కంపెనీ ఈ విషయం గురించి సమాచారం అందిస్తోంది. సమాచారం అందుకున్న సదరు వాహన యజమానులు, అధీకృత జీప్ సర్వీస్ సెంటర్లను సందర్శించడం ద్వారా ఈ సమస్యను ఉచితంగా సరిచేస్తారని కంపెనీ తెలిపింది.

ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 15 నిమిషాల సమయం పడుతుందని, ఈ మరమ్మత్తు కోసం వాహనాల యజమానుల నుంచి ఎలాంటి అదనపు వసూలు చేయమని జీప్ పేర్కొంది.

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

ఈ విషయం గురించి ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పార్థా దత్తా మాట్లాడుతూ, "మా వినియోగదారుల భద్రతకు మరియు మా వాహనాల నాణ్యతకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ సమస్యను త్వరగా గుర్తించి, ముందు జాగ్రత్తలు తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. మా కస్టమర్లను సురక్షితంగా మరియు సంతోషంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. జీప్ బ్రాండ్ వాహనాలు రహదారిపై అత్యంత విశ్వసనీయమైన మరియు నమ్మదగిన వాహనాలుగా ఉండటం పట్ల మేము గర్వంగా ఉన్నామ"ని అన్నారు.

MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

జీప్ కంపాస్ కార్లలో వైపర్ బ్రేస్ నట్ ఫిట్‌మెంట్ సమస్య, రీకాల్

జీప్ కంపాస్ 2020 మోడల్ ఇయర్ రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వాహనాల నాణ్యత విషయంలో జీప్ ఎల్లప్పుడూ ఒకడుగు ముందే ఉంటుందని మరోసారి నిరూపించుకుంది. వైపర్ విషయంలో కస్టమర్ల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకమునుపే, కంపెనీ ఈ సమస్యను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవటం నిజంగా ప్రశంసనీయం.

Most Read Articles

Read more on: #రీకాల్ #jeep
English summary
Fiat Chrysler Automobiles India has announced a recall of 547 units of its MY20 Jeep Compass model to correct an issue with a brace nut that is used in the wiper assembly. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X