Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం: పవన్ కళ్యాన్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ న్యూస్: కియా సెల్టోస్ డీజిల్ కార్లలో ఫ్యూయెల్ పంప్ ఇష్యూ, సర్వీస్ క్యాంపెయిన్
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల మిడ్-సైజ్ సెడాన్ కియా సెల్టోస్ ఇప్పుడు సర్వీస్ క్యాంపెయిన్ కు గురైనట్లు తెలుస్తోంది. కియా సెల్టోస్ డీజిల్ వెర్షన్ కార్లలోని ఫ్యూయెల్ పంపులో సమస్య కారణంగా ఈ సర్వీస్ క్యాంపెయిన్ చేసినట్లు సమాచారం.

తాజాగా, టీమ్-బిహెచ్‌పి నుండి లీకైన పత్రాలలో కియా సెల్టోస్ డీజిల్ వెర్షన్ రీకాల్‌కు సంబంధించిన కారణాన్ని చూపిస్తుంది. ఈ నివేదికల ప్రకారం, అక్టోబర్ 2019 నుండి మార్చి 2020 మధ్య కాలంలో తయారైన అన్ని డీజిల్ పవర్డ్ కియా సెల్టోస్ మోడళ్లు ఈ రీకాల్ ద్వారా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. అయితే, రీకాల్ ద్వారా ప్రభావితమైన యూనిట్ల సంఖ్యను ఖచ్చితంగా ఇంకా వెల్లడించలేదు.

వినియోగదారులు తమ డీజిల్ వెర్షన్ కియా సెల్టోస్ ఎస్‌యూవీలను తమకు సమీపంలో ఉన్న సర్వీస్ స్టేషన్‌లో తనిఖీ చేయించుకోవాలి. కంపెనీ ఈ మేరకు కియా సర్వీస్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సర్వీస్ సెంటర్‌కు వచ్చే కియా సెల్టోస్ డీజిల్ కార్ల ఇంధన పంపులను తనిఖీ చేసి, అవసరమైతే ఆ భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేయాలని కంపెనీ సర్వీస్ సెంటర్లను ఆదేశించింది.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

లీకైన పత్రాన్ని గమనించినట్లయితే, లోపభూయిష్టమైన ఇంధన పంపులతో ఉన్న సెల్టోస్ డీజిల్ ఎస్‌యూవీలు వైబ్రేషన్‌కు గురవుడం పికప్ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన పరిస్థితులలో, వాహనాలు స్టార్ట్ కాకుండాపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పత్రంలో సర్వీస్ డీలర్లకు పార్ట్ వివరాలతో పాటు ఇతర సూచనలను కూడా ప్రస్తావించారు.

కాగా, కియా మోటార్స్ ఇండియా ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక కియా సెల్టోస్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్6 కంప్లైంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

ఈ డీజిల్ ఇంజన్‌తో పాటు, కియా సెల్టోస్‌ను మరో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ 115 బిహెచ్‌పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇకపోతే, రెండవది 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్‌తో లభిస్తాయి. టర్బో-పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్ సర్వీస్ క్యాంపెయిన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్ వాహనాలను ఉపయోగించే కస్టమర్లు పైన పేర్కొన్న లక్షణాలను ఎదుర్కొంటే, వారు వెంటనే తమ సమీపంలోని సర్వీస్ డీలర్‌షిప్‌ల వద్దకు వెళ్లి తనిఖీ చేయించుకోవటం మంచిది. కాగా, ఇదే ఇంజన్‌ను హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, కంపెనీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Source:Team-BHP
MOST READ:రోడ్డెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ బస్సులు.. ఎక్కడో తెలుసా..!