మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

కియా మోటార్స్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా సోనెట్ ఎస్‌యూవీని ఆగస్టు 7 న ఆవిష్కరించింది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీకి బుకింగ్స్ కూడా ఆగస్టు 20 న ప్రారంభమైంది. ఇప్పుడు, కేవలం ఒక రోజులో కియా సోనెట్ భారత మార్కెట్లో 6,523 యూనిట్ల బుకింగ్‌లను సవీకరించి కొత్త రికార్డ్ నమోదు చేసింది.

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

కియా సోనెట్ బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో మరియు భారతదేశం అంతటా కంపెనీ డీలర్‌షిప్‌లలో ఓపెన్ చేయబడ్డాయి. వినియోగదారులు కాంపాక్ట్-ఎస్‌యూవీని రూ. 25 వేలకు బుక్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో సోనెట్ భారతదేశంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు, డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

సోనెట్ గురించి కియా మోటార్స్ ఇండియా ఎండి & సిఇఒ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ, సరికొత్త సోనెట్‌కి అద్భుతమైన ప్రతిస్పందన లభిస్తోంది. కియా బ్రాండ్ పై భారతీయ వినియోగదారుల విశ్వాసం మా ఆపరేషన్‌లో కేవలం ఒక సంవత్సరంలోనే ఎంతో ఎత్తుకు పెరిగిందని తెలిపారు.

MOST READ:కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

సోనెట్‌తో మేము ప్రపంచ స్థాయి నాణ్యత, శక్తివంతమైన డిజైన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అసమానమైన లక్షణాలు మరియు అద్భుతమైన ఎంపికలను కలిగి ఉన్న ఉత్పత్తిని వినియోగదారులకు అందిస్తున్నాము.

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

డెలివరీల గురించి మాట్లాడుతూ, అనంతపురం ప్లాంట్ వాంఛనీయ సామర్థ్యంతో పనిచేస్తుండటంతో కియా మోటార్స్ తమ సోనెట్‌ను సాధ్యమైనంత తక్కువ సమయంలో పంపిణీ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉందని వినియోగదారులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము అని ఆయన అన్నారు.

MOST READ:ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

కియా సోనెట్, సెల్టోస్ మాదిరిగానే, కియా సోనెట్ రెండు ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. అవి టెక్-లైన్ మరియు జిటి-లైన్. రెండు వేరియంట్లు మరిన్ని ఫీచర్లు, టెక్నాలజీ మరియు పరికరాలతో వస్తాయి. ఈ విభాగంలో వాటిని చాలా ఆకర్షణీయంగా అందిస్తాయి.

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

కియా సోనెట్ చుట్టూ ఎల్‌ఈడీ లైట్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డిజిటల్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు మరెన్నో ఉన్నాయి.

MOST READ:డీలర్‌షిప్ చేరుకున్న ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 ఎస్‌యూవీ, డెలివరీ ఎప్పుడంటే

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

పవర్ట్రెయిన్ పరంగా, కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికల ద్వారా వస్తుంది. ఇందులో రెండు పెట్రోల్ యూనిట్లు ఉన్నాయి. అవి1.2-లీటర్ మరియు 1.0-లీటర్ టి-జిడి మరియు ఒకే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. మూడు ఇంజన్లు వేర్వేరు ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తాయి, వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, ఐఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి ఉన్నాయి.

మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కియా సోనెట్ భారతదేశంలో ప్రారంభించబడక ముందే మంచి ప్రజాదరణను పొందుతోంది. సోనెట్ ధర దేశీయ మార్కెట్లో రూ. 8 నుంచి 12 లక్షలు, ఎక్స్-షోరూమ్ రేంజ్‌లో ఉంటుంది. ఇది అమ్మకాలను మరింత పెంచడానికి మరింత సహాయపడుతుంది. దేశీయ మార్కెట్లో ప్రారంభించిన తర్వాత, సోనెట్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టయోటా అర్బన్ క్రూయిజర్, హ్యుందాయ్ వెన్యూ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Kia Sonet Registers A Record 6,532 Units Of Bookings On The First Day. Read in Telugu.
Story first published: Saturday, August 22, 2020, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X