Just In
Don't Miss
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు ముందే కియా సోనెట్ చోరీ; ఎక్కడో తెలుసా?
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్, భారత మార్కెట్లో తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కియా సోనెట్ కారుతో ఇప్పటి ఓ వీడియో గేమ్ కూడా తయారైపోయింది. అత్యంత పాపులర్ అయిన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5 (GTA V)లో కియా సోనెట్ కారును చేర్చారు.

జి5 గేమర్స్ / యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, GTA V గేమ్‌ప్లేలో కియా సోనెట్‌ను ప్రదర్శించారు. ఈ వీడియోలో, గేమర్ మొట్టమొదట మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో విమానాశ్రయానికి డ్రైవింగ్ చేయడాన్ని చూడవచ్చు, ఆ తర్వాత ఎగుమతికి సిద్ధంగా ఉన్న సోనెట్ ఎస్‌యూవీలతో కూడిన కార్గో విమానంలో ప్రవేశించి, గేమర్ ఓ గోల్డ్ కలర్ సోనెట్‌ను దొంగిలించి, సోనెట్ కారులో పారిపోవడాన్ని చూడొచ్చు. ఆ తర్వాత గేమ్‌లో పోలీసుల ఛేజ్ వంటి సీన్‌లను కూడా ఇందులో చూడొచ్చు. సరదాగా సాగిపోయే ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
గేమింగ్ వరల్డ్ నుండి రియల్ వరల్డ్‌కి వస్తే, కియా సోనెట్ కారుని సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. కియా సోనెట్ మొత్తం రెండు వెర్షన్లలో (టెక్-లైన్ మరియు జిటి-లైన్) లభ్యం కానుంది. కియా సోనెట్‌లోని అన్ని వేరియంట్‌లు మరియు వెర్షన్లు అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటాయి.
MOST READ:భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

కియా సోనెట్ విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి 84 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెండవది 119 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇకపోతే, ఇందులోని డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ రెండు వేర్వేరు ట్యూనింగ్స్‌లో లభిస్తాయి. అందులో మొదటిది 99 బిహెచ్‍పి పవర్, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి). ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో రెండవది 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
MOST READ:అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్‌కి ఏం జరిగిందో చూసారా ?

కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది.

అంతేకాకుండా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లతో కియా సోనెట్ లభ్యం కానుంది.
MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌ప్పార్క్ అభిప్రాయం.
కియా సోనెట్ కాన్సెప్ట్‌ను మొట్టమొదటి సారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచినప్పటి నుండి, ఈ ఎస్‌యూవీపై భారత మార్కెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. భారత్‌లో కియా సోనెట్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది.