కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటైన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఈ ఏడాది ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించననున్నట్లు కియా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, తాజాగా కియా తమ సోనెట్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోని విడుదల చేసింది. ఇందులో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌ను చూపించారు.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఈ టీజర్ వీడియోలో కియా సోనెట్ మోడల్‌లోని కొన్ని డిజైన్ అంశాలను కూడా వెల్లడి చేశారు. ఇందులో ప్రధానంగా ఈ కారు యొక్క రియర్ ప్రొఫైల్‌ను వెల్లడి చేస్తుంది. ఇందులో బూట్ లిడ్ పొడవు అంతటా ఉండే ఎల్ఈడి లైట్ బార్‌ ఉంటుంది. ఇరువైపులా స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్‌ను కూడా ఇందులో చూడొచ్చు.

ఈ వీడియోలో వెల్లడైన ఇతర ఫీచర్లలో యాంటెన్నా, రూఫ్ రెయిల్స్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, రియర్ విండ్‌షీల్డ్ వైపర్ అసెంబ్లీ మరియు లైట్ బార్ క్రింద బూట్ లిడ్ మధ్యలో ఉంచిన కియా బ్యాడ్జింగ్ వంటి మార్పులను చూడొచ్చు.

MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఇంకా ఈ వీడియోలో కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్యాగ్‌లైన్‌ను కూడా వెల్లడించారు. కియా మోటార్స్ దీనిని 'వైల్డ్ బై డిజైన్' అని పిలుస్తోంది. బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్‌తో పోల్చితే, సెల్టోస్‌కు 'బ్యాడాస్ బై డిజైన్' అనే ట్యాగ్‌లైన్ ఇచ్చిన సంగతి తెలిసినదే.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

కియా సోనెట్ వరల్డ్ ప్రీమియర్ దాని బిగ్ బ్రదర్ అయిన కియా సెల్టోస్ మాదిరిగానే భారతదేశంలోనే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తర్వాత, సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఆగస్ట్ నెలాఖరులో కానీ లేదా సెప్టెంబర్ ప్రారంభం నాటికి కానీ ఇది భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

MOST READ:ఇండియన్ మోటార్‌సైకిల్ కాంపిటీషన్: ఫ్రీ యూరప్ ట్రిప్!

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఈ కొరియన్ బ్రాండ్‌కు కియా సోనెట్ భారత మార్కెట్లో మూడవ మోడల్ అవుతుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో కియా మోటార్స్ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మరియు కార్నివాల్ ఎమ్‌పివిని విక్రయిస్తోంది. ఈ రెండూ కూడా ఇప్పటికే భారత మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి. కియా మోటార్స్ ఇండియా లైనప్‌లోని సెల్టోస్ బ్రాండ్ క్రింద ఎంట్రీ లెవల్ మోడల్‌గా సోనెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఈ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో కియా సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ కారుకి బోల్డ్ అండ్ అగ్రెసివ్ లుక్‌నిస్తుంది. వీటితో పాటు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, చంకీ బాడీ క్లాడింగ్ ఉండొచ్చని అంచనా.

MOST READ:టీవీఎస్ టీజర్ వీడియోలో అమితాబ్-ధోని : కొత్తగా ఏం విడుదలవుతోంది?

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో కూడా రానుంది, ఈ విభాగంలో ఇది చాలా స్పోర్టీ మరియు ప్రీమియం ఆకర్షణను ఆఫర్ చేయనుంది. ఇందులో బ్రాండ్ యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఇంకా ఇందులో రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ మరియు బహుళ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ వంటి మరిన్నో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉండనుంది.

MOST READ:ఆప్రిలియా స్టోర్మ్ 125 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

ఇంజన్ విషయానికి వస్తే, కియా భాగస్వామి హ్యుందాయ్ తమ వెన్యూ మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ కొత్త సోనెట్‌లోనూ ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇందులో ఒకే రకమైన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు (1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్) ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవన్-స్పీడ్ డిసిటి మరియు హ్యుందాయ్ తాజాగా పరిచయం చేయనున్న ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వంటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

కియా సోనెట్ మోడల్‌ను కూడా ప్రస్తుతం సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లను తయారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్‌లోనే తయారు చేయనున్నారు.

కియా సోనెట్ కాన్సెప్ట్ కారును తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఎక్స్‌పోలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో భారీ హైప్‌ను సృష్టించింది. కియా మోటార్స్ ఎస్‌పి2 కాన్సెప్ట్ (సెల్టోస్) మాదిరిగానే చాలా డిజైన్ ఎలిమెంట్లను ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్‌లోను క్యారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కియా సోనెట్ టీజర్ విడుదల; ఆగస్ట్ 7న గ్లోబల్ ప్రీమియర్

కియా సోనెట్ టీజర్ ఇమేజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్‌ అతి త్వరలోనే భారత మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. భారత మార్కెట్లో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న కియా సోనెట్ ఈ విభాగంలోని మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇదే విభాగంలో నిస్సాన్, రెనాల్ట్ సంస్థలు కూడా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Most Read Articles

English summary
The South Korean automaker has announced its third product the Sonet will be globally premiered on August 7, 2020. Ahead of launch the company has released a new teaser, which reveals a production-ready model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X