ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. 'లాంబోర్గినీ సియోన్ రోడ్‌స్టర్' పేరిట ఆవిష్కరించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కేవలం 19 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్‌కు 19 మంది మాత్రమే యజమానులు ఉండనున్నారన్నమాట. లాంబోర్గినీ బ్రాండ్ ఐకానిక్ వి12 ఇంజన్‌ను ఉపయోగించి ఈ ఓపెన్-టాప్ హైబ్రిడ్ సూపర్ స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేశారు.

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

మునుపటి లాంబోర్గినీ మోడళ్ల స్టైలింగ్ అంశాలతో స్టాండర్డ్ సియోన్‌లో కనిపించే అసాధారణమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను సియోన్ రోడ్‌స్టర్ కలిగి ఉంటుంది. టెర్జో మిలీనియో కాన్సెప్ట్ కారు మాదిరిగా వై-ఆకారంలో ఉండే హెడ్‌లైట్స్, కాపర్ కోటెడ్ అల్లాయ్ వీల్స్, కౌంటాచ్ నుండి ప్రేరణ పొందిన ఆరు హెక్సాగనల్ టెయిల్ ల్యాంప్స్, పెద్ద డిఫ్యూజర్ మరియు పెద్ద టెయిల్ పైప్ డిజైన్ వంటి విశిష్టమైన మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

ఈ కారు లోపలి భాగాన్ని గమనిస్తే, లాంబోర్గినీ సియోన్ రోడ్‌స్టర్ సెంటర్ కన్సోల్‌లో నిలువుగా అమర్చిన డిజిటల్ టచ్‌స్క్రీన్‌తో పాటుగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. వీటి చుట్టూ బంగారు రంగులో ఉండే గార్నిష్ ఉంటుంది. తెలుపు-బూడిద రంగు కలయితో తయారు చేసిన సీట్స్ మరియు అప్‌హోలెస్ట్రీపై బ్లూ యురేనస్ స్టిచింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

MOST READ: 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, ఈ సూపర్ కారులో అదే 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. కాకపోతే ఇది అత్యంత శక్తివంతమైన ఓపెన్-టాప్ ర్యాగింగ్ బుల్‌గా మార్చేందుకు ఈ ఇంజన్‌ను కొద్దిగా ట్యూన్ చేశారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 783 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 48వి తేలికపాటి-హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారుకు అదనంగా 33 బిహెచ్‌పి శక్తిని (మొత్తంగా ఈ కారు 816 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది) జోడిస్తుంది. లాంబోర్గినీ సియోన్ రోడ్‌స్టర్ కేవలం 2.9 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

ఈ సరికొత్త సూపర్ కారును ఆవిష్కరించిన సందర్భంగా, ఆటోమొబిలి లాంబోర్గినీ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెఫానో డొమెనికాలి మాట్లాడుతూ.. "సియోన్ రోడ్‌స్టర్ మోడల్ లాంబోర్గినీ యొక్క స్పిరిట్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇది ఉత్కంఠభరితమైన డిజైన్, అసాధారణమైన పనితీరు, ముఖ్యంగా భవిష్యత్ సాంకేతికతలను కలిగి ఉంటుంది. సియోన్ యొక్క వినూత్న హైబ్రిడ్ పవర్‌ట్రైన్ లాంబోర్గినీ సూపర్ స్పోర్ట్స్ కార్ల భవిష్యత్ దిశను సూచిస్తుంది, ఈ కొత్త ఓపెన్-టాప్ సియోన్ రోడ్‌స్టర్ అత్యుత్తమ లైఫ్‌స్టైల్ కోసం తయారు చేయబడినద"ని అన్నారు.

MOST READ: మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

"సియోన్ రోడ్‌స్టర్ బ్లూ యురేనస్‌లో అడుగుపెట్టింది, ముఖ్యంగా లాంబోర్గినీ యొక్క సెంట్రో స్టైల్ చేత ఎంపిక చేయబడింది, ఇది యాడ్ పెర్సనమ్ విభాగంతో కలిసి ప్రతి సియోన్ క్లయింట్ ఇష్టానికి అనుగుణంగా వారి రోడ్‌స్టర్ యొక్క రంగు మరియు ఫినిషింగ్‌లను పూర్తిగా వ్యక్తిగతీకరించడానికి పనిచేస్తుంది. ఆకాశం యొక్క నీలం మరియు పొలాల యొక్క ఆకుపచ్చ రంగుల కలయికతో (నింగి-నేల) తయారు చేసిన ఈ ఓపెన్ టాప్ సియోన్ రోడ్‌స్టర్ తన అద్భుతమైన పనితీరుతో ఉల్లాసభరితమైన డ్రైవింగ్ స్వేచ్ఛను అందిస్తుంది. ఈ కారును ఓరో ఎలక్ట్రమ్ చక్రాలతో తయారు చేశారు. పూర్తయింది: విద్యుదీకరణను సూచించడానికి లాంబోర్గినీ నీలం రంగును ఎంచుకుంది" అని ఆయన అన్నారు.

ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు

లాంబోర్గినీ సియోన్ రోడ్‌స్టర్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాంబోర్గినీ సియోన్ రోడ్‌స్టర్ ఈ సూపర్ కార్ గేమ్‌ను ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుంది. ప్రత్యేకించి ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిని కేవలం 19 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పటికే ఈ కార్లన్నీ కూడా ఉత్పత్తికి ముందే అమ్ముడైపోయాయి. ఇకపై ఎవరైనా ఈ కారును కొనాలనున్నా వారికి ఆ అదృష్టం ఉండదు. ఈ కారు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు అయితే, దీని ధర సుమారు రూ.25 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Lamborghini has unveiled the Sián Roadster, which is a limited edition, open-top hybrid super sports car engineered around Lamborghini's iconic V12 engine. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X