Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెరల్ క్యాప్సూల్ డిజైన్‌తో కొత్త 2021 లాంబోర్గినీ ఉరస్ ఎస్‌యూవీ, నచ్చిందా..?
ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ 'లాంబోర్గినీ' అందిస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ 'లాంబోర్గినీ ఉరస్' లో కంపెనీ ఓ సరికొత్త డిజైన్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. పెరల్ క్యాప్సూల్ డిజైన్ పేరిట సరికొత్త 2021 లాంబోర్గినీ ఉరస్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే యజమానులు ఇకపై ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ స్టైల్‌ను తమకు నచ్చినట్లుగా ఎంచుకునే సౌకర్యం ఉంటుందని కంపెనీ తెలిపింది.

లాంబోర్గినీ అందిస్తున్న ట్రెడిషనల్ ఫోర్-లేయర్ పెరల్ కలర్స్ అయిన గియాలో ఇంటి, అరాన్సియో బొరేలిస్ మరియు వెర్డె మాంటిస్ అనే కలర్ ఆప్షన్లలో కమస్టమర్లు టూ-టోన్ కలర్‌ను ఎంచుకోవచ్చు. ఎక్స్టీరియర్ పెయింట్ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఇంటీరియర్ స్టయిలింగ్‌ను కూడా బ్లాక్ అండ్ బాడీ కలర్‌తో కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఇందులో కారు పైభాగం (రూఫ్) మరియు వెనుక డిఫ్యూజర్ మరియు స్పాయిలర్ లిప్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో వస్తాయి. టెయిల్ పైప్స్ (ఎగ్జాస్ట్)ను కూడా స్పోర్టీ మ్యాట్ గ్రే ఫినిష్‌తో డిజైన్ చేశారు. ఇందులో హై గ్లాసీ ఫినిష్‌తో కూడిన 21-ఇంచ్ రిమ్స్ ఉంటాయి.

ఇంటిరీయర్లలోని సీట్లు రెండు కలర్లలో (బాడీ కలర్ మరియు బ్లాక్) వస్తాయి. వాటిపై స్టిచింగ్ కూడా బాడీ కలర్‌లోనే ఉంటుంది. సీట్లపై ప్రత్యేకంగా హెక్సాగనల్ షేపులో ఉండే స్టిచింగ్ డిజైన్ ఉంటుంది. క్యాబిన్ లోపల కొత్త కార్బన్ ఫైబర్ మరియు బ్లాక్ ఆనోడైజ్డ్ అల్యూమినియం డీటైల్స్ కూడా కనిపిస్తాయి.
MOST READ: కరోనా నివారకు NHAI కొత్త టెక్నలాజి, ఏంటో తెలుసా..?
ఈ కొత్త 2021 లాంబోర్గినీ ఉరస్ ఎస్‌యూవీలో కొత్త డిజైన్‌తో పాటుగా మరో కీలకమైన ఫీచర్ ఏంటంటే ఇందులో ఆప్షనల్‌గా ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్‌తో కూడిన పార్కింగ్ అసిస్టెన్స్ ప్యాకేజ్ కూడా వస్తుంది. ఈ సిస్టమ్ సాయంతో డ్రైవర్ అవసరం లేకుండా ఈ కారు దానంతట అదే రిమోట్‌గా పార్క్ చేసుకుంటుంది.

ఇలా చేసేటప్పుడు మానవ ప్రమేయం లేకుండా కారు దానంటత అదే స్టీరింగ్, యాక్సిలరేటర్ మరియు బ్రేక్‌లను కంట్రోల్ చేసుకుంటుంది. కారు రిమోట్‌లో ఉండే ఓ బటన్‌ను నొక్కగానే ఇది సాధ్యమవుతుంది. ప్యారలల్ పార్కింగ్ అయినా లేదా పర్పెండిక్యులర్ పార్కింగ్ అయినా సరే కారు ఎంచక్కా ఆటోమేటిక్‌గా పార్క్ అవుతుంది.

లాంబోర్గినీ 2012లో చైనాలో జరిగిన బీజింగ్ ఆటో షో తొలిసారిగా ఈ పవర్‌ఫుల్, స్టయిలిష్ అండ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఉరస్'ని ఆవిష్కరించింది. సాలిడ్ బాడీ, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో తయారైన ఈ ఇటాలియన్ స్పోర్ట్స్ ఎస్‌యూవీలో గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను వచ్చే శక్తి నాలుగు చక్రాలకు (ఆల్-వీల్ డ్రైవ్) సమానంగా పంపిణీ అవుతుంది.
MOST READ: టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

ఈ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 180 మైళ్లు (అంటే గంటకు 289.68 కి.మీ. వేగం). లాంబోర్గినీ ఉరస్ కేవలం 5.4 అడుగుల ఎత్తును, 6.5 అడుగుల వెడల్పును, 16.4 అడుగుల పొడవను కలిగి మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని తేలికగా ఉంచేందుకు గానూ దీని తయారీలో అత్యధిక భాగం కార్బన్ ఫైబర్ రీఫైన్డ్ పాలిమర్‌ను ఉపయోగించారు (అందుకే ఇది అంత వేగంతో పరుగులు తీసుకుంది).

లాంబోర్గినీ ఉరస్ కొత్త పెరల్ క్యాప్సూల్ డిజైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
సాధారణంగా లాంబోర్గినీ ఎక్కడున్నా తొలిచూపులోనే అన్నింటి కన్నా ముందుగా స్టాండవుట్ అవుతాయి. అలాంటి, ఈ సూపర్ కార్లకు మరింత స్టయిలింగ్ ప్యాకేజ్‌ని జోడిస్తే కొనుగోలుదారుల కళ్లు జిగేల్‌నమటం ఖాయం. కోట్ల రూపాయల ఖరీదు చేసే ఈ కార్లు, వాటిని కొనుగోలు చేసే వ్యక్తుల మాదిరిగానే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక ఈ లాంబోర్గినీ ఉరస్ ఎస్‌యూవీ కూడా ఈ కొత్త దుస్తుల్లో మరింత అందగా కనిపిస్తోంది.