Just In
- 12 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 16 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 17 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
Mercury Transit in Aries on 16 April:మేషంలోకి బుధుడి సంచారం వల్ల.. ఈ 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!
- News
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్య... పదునైన ఆయుధాలతో దాడి...
- Movies
‘ఆరెంజ్’ మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. చరణ్ విషయంలో అలా!
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేతులు కలిపిన మహీంద్రా
భారతదేశంలోని టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, బ్రాండ్ యొక్క ఆఫ్టర్ సేల్స్ నెట్‌వర్క్ అయిన మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ ఇప్పుడు టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీసెస్‌తో కలిసిపోతుంది.

ఈ వాటా స్వాప్ లావాదేవీలో, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ ఇప్పుడు టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీసెస్ యొక్క అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. మల్టీ-బ్రాండ్ ఇండిపెండెంట్ ఆటోమొబైల్ ఆఫ్టర్ మార్కెట్ బ్రాండ్ అయిన ‘మైటీవీఎస్'ను మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ యాక్సెస్ చేయనుంది.

ఇందుకు ప్రతిగా, టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మహీంద్రా వాటాను పొందనుంది. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు "భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆటోమొబైల్ ఆఫ్టర్ మార్కెట్ సేవల స్థలాన్ని నిర్వహించడానికి వారికి మరింత బలాన్ని మిళితం చేస్తుంది."
MOST READ:ఆగ్రాలో ఫాస్ట్ ఛార్జర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన ఎంజి మోటార్స్

ఈ లావాదేవీల వలన టీవీఎస్ ఆటోమొబైల్ సర్వీసెస్ మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ యొక్క విస్తారమైన పాన్-ఇండియా ఉనికిని ప్రభావితం చేయగలదు. ఆఫ్టర్ సేల్స్ నెట్‌వర్క్‌లో 475కి పైగా ఫ్రాంచైజీలు మరియు 100కి పైగా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఇవి 25 రాష్ట్రాల్లోని 350 పట్టణాల్లో మరియు దేశవ్యాప్తంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి.

ఈ ఒప్పందం గురించి టివిఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆర్. దినేష్ మాట్లాడుతూ "మొత్తం ఆఫ్టర్ మార్కెట్ ఎకోసిస్టమ్‍కు లబ్ధి చేకూర్చడం కోసం రెండు గొప్ప బ్రాండ్లు కలిసి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశపు 10 బిలియన్ డాలర్ల ఆఫ్టర్ మార్కెట్ విభాగం విచ్ఛిన్నమై ఉంది, దీనిని సరిచేసేందుకు ఆటోమోటివ్ రంగంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బలమైన మద్దతు ఎంతో అవసరం."
MOST READ:మనదేశంలో అక్కడ కమర్షియల్ వాహనాలకు రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఎక్కడో తెలుసా

"వేలాది మంది పారిశ్రామికవేత్తలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి మేము ఈ అవకాశాన్ని ఎంచుకున్నాము. దీనిలో మార్కెటింగ్, డయాగ్నస్టిక్స్, కస్టమర్ అనుభవం, నాణ్యమైన భాగాలు, శిక్షణ మరియు డిజిటల్ చెల్లింపుల ద్వారా డిజిటల్ టెక్నాలజీల నుండి వారు ప్రయోజనం పొందవచ్చు. ఈ భాగస్వామ్యం ఖచ్చితంగా విజయవంతమవుతుందని నేను విశ్వసిస్తున్నాని" ఆయన అన్నారు.

ఇదే విషయంపై మహీంద్రా గ్రూప్ మొబిలిటీ సర్వీసెస్ సెక్టార్ ప్రెసిడెంట్ వి.ఎస్. పార్థసారథి మాట్లాడుతూ, "ఎమ్ఎఫ్‌సిఎస్ఎల్ పెద్ద, నమ్మకమైన మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ ఫ్రాంచైజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చింది. నాణ్యత మరియు కస్టమర్ సంతృప్తిపైనే మేము ఎల్లప్పుడూ దృష్టి పెట్టాము."

"కన్సాలిడేషన్, స్కేల్ మరియు ఫిజిటల్ సొల్యూషన్స్ సంస్థతో పాటు పరిశ్రమకు కూడా తరువాతి దశ వృద్ధిని ఇస్తాయని నేను విశ్వసిస్తున్నాను. టివిఎస్ ఎఎస్పిఎల్ వంటి బలమైన భాగస్వామి మన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరియు సంస్థను ముందుకు నడిపించడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను."
MOST READ:అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

"మా ఫ్రాంఛైజీలు, పంపిణీదారులు మరియు ఉద్యోగుల యొక్క నిబద్ధత మరియు అభిరుచిని నేను అభినందిస్తున్నాను మరియు మేము తరువాతి దశ ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారి మద్దతును కోరుతున్నాను." అని ఆయన అన్నారు.
MOST READ:స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సర్వే బోట్ : ఇంతకీ దీని ఉపయోగమేంటో మీకు తెలుసా ?

మహీంద్రా - టీవీఎస్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ రెండు సంస్థల మధ్య వాటా స్వాప్ లావాదేవీ విచ్ఛిన్నమైన ఆఫ్టర్ మార్కెట్ పరిష్కారాలను ఒకచోట చేర్చడానికి సహాయపడుతుంది. ఈ రెండు కంపెనీలు కూడా ఈ భాగస్వామ్యం నుండి లాభం పొందుతాయి, భవిష్యత్తులో కొత్త పరిష్కారాలను ప్రవేశపెట్టడంలో కలిసి పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.