దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఆటో మార్కెట్లో మహీంద్రా ఇప్పుడు ఒక కొత్త ఫంకీ కాన్సెప్ట్ ని ఆవిష్కరించింది. ఇది రెండవ తరం ఎక్స్‌యువి 500 ను ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేయబడింది. మహీంద్రా యొక్క కొత్త మోడల్ కంటే కూడా ఫన్‌స్టర్ డిజైన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్ రాడికల్ డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్స్‌ని కలిగి ఉంటుంది. మహీంద్రా ఫన్‌స్టర్‌లో ఎల్ - ఆకారపు ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది. మధ్యలో సొగసైన గ్రిల్ కూడాఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ మహీంద్రా యొక్క బ్రాండ్ లోగోని కలిగి ఉంటుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

ఫన్‌స్టర్‌లో అల్లాయ్ వీల్స్ నీలి రంగు మరియు నలుపురంగుల ఆక్సెన్ట్ ని కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ఎల్ఇడి లైట్స్ ఒకే వరసలో ఒకే ముక్కలాగా ఉంటుంది. స్లాన్టింగ్ గ్రాడియెంట్ ని కలిగి ఇది చూడటానికి చాలా స్పోర్టివ్ గా కనిపిస్తుంది. ఇందులో ఫ్రేమ్‌లెస్ విండ్‌షీల్డ్ ని కలిగి ఉండటమే కాకుండా ఓపెనింగ్ డోర్స్ సీతాకోక చిలుకని పోలినట్లు ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల ఇది స్పోర్టివ్ గా కనిపిస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్‌లో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు 309 bhp ని ఉత్పత్తి చేసే 59.1 kwh యొక్క పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటాయి. మహీంద్రా యొక్క ఈ ఎలక్ట్రిక్ కారు ఒక చార్జిపై దాదాపు 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు మహీంద్రా ప్రకటించిన నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలలో ఫన్‌స్టర్ కాన్సెప్ట్ ఒకటి. ఇంకా ఈ జాబితాలో eKUV100, eXUV300 మరియు ఆటమ్ క్వాడ్రిసైకిల్ కూడా ఉన్నాయి. మహీంద్రా eKUV100 ని రూ. 8.25 లక్షలకి (ఎక్స్ షోరూం- ఇండియా) విడుదల చేసింది.

దిగ్గజాలకు దడ పుట్టించిన మహీంద్రా కొత్త కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2020 లో మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్‌ డిజైన్ ని మాత్రమే ఆవిష్కరించడం జరిగింది. ఏదేమైనా ఇది అతి త్వరలో మార్కెట్లోకి విడుదలవుతుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Auto Expo 2020: Mahindra Funster Concept Unveiled - Previews The Second-Generation XUV500. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X