మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈ వీకెండ్ (నవంబర్ 7 మరియు నవంబర్ 8)లో దేశవ్యాప్తంగా 500 యూనిట్ల థార్ వాహనాలను తమ కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ థార్ మెగా డెలివరీ పేరుతో ఒక్క వారాంతంలోనే భారీ సంఖ్యలో థార్ ఎస్‌యూవీలను డెలివరీ చేస్తోంది. బుకింగ్స్ ప్రయారిటీ ఆధారంగా ఈ డెలివరీలు ఉంటాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సిఈఓ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా 500 సరికొత్త థార్ వాహనాలను పంపిణీ చేయడం ద్వారా కస్టమర్ల దీపావళి సంబరాలను రెట్టింపు చేసినందుకు మేము సంతోషిస్తున్నాము. మేము మా డెలివరీలను కిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, సకాలంలో మరియు ఇబ్బందులు లేని డెలివరీని అందిస్తామని మా వినియోగదారులకు నేను భరోసా ఇస్తున్నాన"ని అన్నారు.

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

ఇప్పటికే ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించిన మొట్టమొదటి మహీంద్రా థార్‌ను, వేలంలో గెలుచుకున్న విజేత ఆకాష్ మిండాకు డెలివరీ చేశారు. ప్రస్తుతం, మార్కెట్లో కొత్త తరం మహీంద్రా థార్ కోసం ఇప్పటికే 20,000 పైగా బుకింగ్స్ వచ్చాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ చేసేందుకు కంపెనీ వచ్చే జనవరి నాటికి థార్ ఉత్పత్తిని 2,000 యూనిట్ల నుండి 3,000 యూనిట్లకు పెంచాలని యోచిస్తోంది.

MOST READ:వాహనాల వేగపరిమితిని పెంచడానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

మార్కెట్లో కొత్త 2020 థార్ ఏఎక్స్ & ఏఎక్స్ (ఓ) సిరీస్ రూ .9.80 లక్షల నుంచి రూ .12.20 లక్షల మధ్య రిటైల్ అవుతుండగా, టాప్-స్పెక్ ఎల్ఎక్స్ సిరీస్ ధర రూ.12.49 లక్షల నుండి 13.75 లక్షల మధ్యలో రీటైల్ అవుతోంది (పైన పేర్కొన్న అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త మహీంద్రా థార్ ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

ఈ నెక్స్ట్ జనరేషన్ థార్‌లో ఎస్‌యూవీకి ఖరీదైన అనుభూతినిచ్చే అనేక పరికరాలను జోడించటంతో పాటుగా సరికొత్త డిజైన్‌తో దీనిని తయారు చేశారు. ఇందులో కొత్త ఇంజన్లను కూడా జోడించారు. న్యూ-జెన్ థార్‌లో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజన్‌తో పాటు కొత్త పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ జోడించింది. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

MOST READ:కార్ బోనెట్‌పై పడ్డ పోలీస్.. అలాగే డ్రైవ్స్ చేసిన కార్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందంటే ?

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అన్ని వేరియంట్లలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్స్ మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి.

మహీంద్రా థార్ మెగా డెలివరీ ఈవెంట్; వీకెండ్‌లో 500 ఎస్‌యూవీల డెలివరీ

మహీంద్రా థార్ 500 యూనిట్స్ మెగా డెలివరీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆకర్షణీయమైన ధరతో మరియు సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో మహీంద్రా తమ కొత్త థార్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త తరం థార్ విడుదలైనప్పటి నుండి భారీ స్థాయిలో బుకింగ్‌లను అందుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ అమ్మకాల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం కూడా ఉంది.

MOST READ:మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

Most Read Articles

English summary
Mahindra To Conduct Mega Delivery Event Of The All-New Thar, 500 Units To Be Delivered Across The Country During This Weekend. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X