లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

గడచిన మే నెలలో లాక్‌డౌన్ కారణంగా దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలను నష్టాలను నమోదు చేస్తే.. భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకి చెందిన వ్యవసాయ పరికాల విభాగం మాత్రం గడచిన మే నెలలో 2 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసుకుంది.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

ఈ సమయంలో మహీంద్రా గ్రూప్ ఫామ్ ఎక్విప్‌మెంట్ విభాగం 24,017 యూనిట్లను విక్రయించి 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మే 2019లో ఈ అమ్మకాల సంఖ్య 23,539గా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

మే 2020లో మహీంద్రా ట్రాక్టర్స్ ఎగుమతులు మాత్రం భారీగా క్షీణించాయి. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా విదేశీ రవాణా స్థంభించడంతో గత నెలలో మహీంద్రా కేవలం 324 ట్రాక్టర్లను మాత్రమే ఎగుమతి చేసింది. మే 2019లో మాత్రం కంపెనీ 1,165 ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అప్పటితో పోల్చుకుంటే ట్రాక్టర్ల ఎగుమతిలో 72 శాతం క్షీణత నమోదైంది.

MOST READ: ఆ విడి భాగాలను ఇక్కడే తయారు చేయాలి, దిగుమతులు నిషేధించాలి: మంత్రి

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ.. గడచిన మే నెలలో లాక్‌డౌన్ నుంచి సరైన సమయంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన సడలింపుల కారణంగా ట్రాక్టర్లకి డిమాండ్ పెరిగిందని అన్నారు.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

అద్భుతమైన రబీ పంట, అధిక సేకరణ, మంచి ధరలు మరియు ఇతర పంటలకు ప్రయోజనం చేకూర్చే సాధారణ రుతుపవనాల వాతావరణ సూచనలతో సహా ఇతర పరిణామాల వల్ల రైతుల సెంటిమెంట్ సానుకూలంగా కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ట్రాక్టర్ డిమాండ్‌కి చక్కగా పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది.

MOST READ: రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

కంపెనీ మే 2020 లో మొత్తం (దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి) అమ్మకాలలో 24,341 యూనిట్లను నమోదు చేసింది, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 24,704 యూనిట్లతో పోలిస్తే ఇది ఒక శాతం తగ్గుదలను సూచిస్తుంది.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రైవేటు వాహన విభాగాలలో డిమాండ్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, మహీంద్రా గ్రూపు కోలుకోవటానికి ఈ ట్రాక్టర్ విభాగం తోడ్పడనుంది. మహీంద్రా ఈ ఫలితాలు ప్రకటించిన తర్వాత బాంబే స్టాక్ ఎక్సేంజ్ వద్ద కంపెనీ షేర్ల విలువ 2.35 శాతం పెరిగి వద్ద రూ.520.70 వద్ద ముగిసింది.

MOST READ: రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

మూలధన కేటాయింపుల విషయానికొస్తే మహీంద్రా అండ్ మహీంద్రా అద్భుతంగా పని చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ బ్రాండ్ ముందు నుంచే తన వనరులను ఉత్పాదక మరియు సమర్థవంతమైన వ్యాపారాలకు మళ్లించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే కంపెనీ తమ నిధులను నెమ్మదిగా సాగే లేదా లాభాలు ఆర్జించని వ్యాపారాల నుండి ఉత్పాదక మరియు సమర్థవంతమైన వ్యాపారాల వైపుకు మళ్ళిస్తోంది.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

కాగా.. ఈ కంపెనీ గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో రూ.3,255 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇందులో రూ.2,780 కోట్ల నష్టం మహీంద్రా దక్షిణ కొరియా అనుబంధ సంస్థ 'శాంగ్‌యాంగ్' మరియు అమెరికాలో దాని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వ్యాపారం నుంచే వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మహీంద్రా తమ శాంగ్‌యాంగ్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు పెట్టుబడిదారుల వెతుకుతోంది అలాగే యూఎస్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం నుండి నిష్క్రమించాలని యోచిస్తోంది.

MOST READ: కరోనా నివారకు NHAI కొత్త టెక్నలాజి, ఏంటో తెలుసా..?

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

మహీంద్రా ట్రాక్టర్ వ్యాపార వృద్ధిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇది మహీంద్రాకు శుభవార్త. లాక్‌డౌన్ సమయంలో మహీంద్రా గ్రూపుకి చెందిన ఇతర విభాగాలు నష్టాలను నమోదు చేస్తుంటే, ట్రాక్టర్ విభాగం మాత్రం వృద్ధిని నమోదు చేసింది. కాకపోతే ఈ ఆదాయాలు కంపెనీ చెందిన కార్ల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాలతో పోల్చుకుంటే తక్కువగా ఉండొచ్చు కానీ, ఇది కంపెనీకి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది అద్భుతమైన సంకేతంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
Mahindra & Mahindra Limited's Farm Equipment Sector announced a 2 percent growth in domestic sales for May 2020. The brand registered 24,017 units in sales during the month, as compared to the 23,539 units sold during the same period last year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X