ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కంపెనీలలో మారుతి ఒకటి. మారుతి బ్రాండ్ నుంచి ఇప్పటికి చాలా వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పుడు మారుతి సరికొత్త ఫ్యూచురో - ఇ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఆవిష్కరించింది. దీనిని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

మారుతి నుంచి కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఇది మారుతి బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ ఎస్‌యూవి. మారుతి రాబోయే తరం కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది.

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వెహికల్ కూపే లాంటి డిజైన్ ని కలిగి ఉంటుంది. విస్తృత ఎల్‌ఈడీ స్ట్రిప్ హెడ్ లాంప్ లను కలిగి ఉంటుంది. మారుతీ ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్ యొక్క రూపకల్పన చాలా కొద్దిపాటిగానే ఉంటుంది. కానీ సూటబుల్ క్యారెక్టర్ లైన్స్ మరియు క్రేజెస్ ఈ ఎస్‌యూవి చుట్టూ ఉంటాయి.

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

మారుతి ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్ లో నాలుగు సీట్ల కాన్ఫిగిరేషన్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఫ్యూచరిస్టిక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. మారుతి ఎలక్ట్రిక్ కారు లార్జ్ స్క్రీన్లతోపాటు, కొద్దిపాటి డిజైన్ ని కూడా కలిగి ఉంటుంది.

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

మారుతీ సుజుకి నివేదికల ప్రకారం ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్‌లో ముందు ఉన్న సీట్లు వెనుక ఉండే ప్రయాణికులకు చాల అనుకూలంగా ఉంటుంది. మారుతి ఈ ఎలక్ట్రిక్ కారు పేరు "ఫ్యూచురో-ఇ కోసం" కొన్ని నెలల క్రితమే పేటెంట్ హక్కులకోసం దాఖలు చేసింది. మారుతి ఫ్యూచురో-ఇ కారుకి సంబంధించి ఇప్పటికి మనకు పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

మారుతి ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్ యొక్క రూపకల్పన ప్రత్యేకించి భారతీయ మార్కెట్ కోసమే తయారు చేయబడింది. ఇది భవిష్యత్ లో రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్యూచురో-ఎస్ మోడల్ లాగ ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

ఫ్యూచురో- ఇ కాన్సెప్ట్ కారుని ఆవిష్కరించిన మారుతి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి తమ ఫ్యూచురో - ఇ కాన్సెప్ట్‌ను ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆవిష్కరించడం జరిగింది. ఫ్యూచురో - ఇ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ 2021ప్రారంభంలో భారతదేశంలో ప్రవేశపెడుతుంది. కాన్సెప్ట్ వెర్షన్ ఇపుడు ఆవిష్కరించడం వల్ల కొంత సమాచారం మాత్రమే లభిస్తుంది. త్వరలో ఈ మారుతీ ఫ్యూచురో - ఇ కాన్సెప్ట్‌ కి సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

Most Read Articles

English summary
Auto Expo 2020: Maruti Futuro-e Concept Unveiled - Expected Launch Date, Prices, Specs & Images. Read in Telugu.
Story first published: Wednesday, February 5, 2020, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X