మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, గడచిన నెలలో నవరాత్రి సందర్భంగా ప్రకటించిన ఆఫర్లకు కంపెనీకి కాసుల వర్షం కురిపించాయి. గత అక్టోబర్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 1.66 లక్షలకు పైగా కార్లను విక్రయించింది, వీటిలో 95 వేల యూనిట్లు నవరాత్రి మరియు దసరా సమయంలో మాత్రమే అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

ఈ నేపథ్యంలో, ఈ పండుగ జోరును ఇలానే కొనసాగించడానికి మారుతి సుజుకి నవంబర్ నెలలో కూడా తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ దీపావళి సీజన్‌లో కొత్త మారుతి సుజుకి కారు కొనాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో, కంపెనీ నుండి లభిస్తున్న అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు. మారుతి సుజుకి ఈ కారుపై రూ.18,000 నగదు తగ్గింపుతో పాటు రూ.6,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఈ కారుపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

MOST READ:డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో

మారుతి సుజుకి అందిస్తున్న మైక్రో-ఎస్‌యూవీ ఎస్-ప్రెసో మార్కెట్లో ఓ ప్రత్యేకమైన కారు. ఈ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.6,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి సెలెరియో

మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.25,000 వరకూ క్యాష్ డిస్కౌంట్, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ.20,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.

MOST READ:20,000 యూనిట్ల బుకింగ్స్ దాటిన మహీంద్రా థార్.. మళ్ళీ పెరిగిన వెయిటింగ్ పీరియడ్ పీరియడ్

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి అందిస్తున్న టాల్ బాయ్ కార్ వ్యాగన్ఆర్‌పై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.6,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తున్నారు.

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి స్విఫ్ట్‌

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌పై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.6,000 కార్పొరేట్ బోనస్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌పై రూ.25,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ మరియు రూ.6,000 కార్పోరేట్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది.

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా

ఇకపోతే, మారుతి కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

మారుతి సుజుకి కార్లపై దీపావళి ఆఫర్స్, భారీ తగ్గింపులు, ప్రయోజనాలు

కంపెనీ అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి మారుతి ఈకోపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుండగా, మారుతి ఎర్టిగాపై కేవలం కార్పొరేట్ డిస్కౌంట్‌ను మాత్రమే అందిస్తున్నారు, ఇది రూ.5,000 లుగా ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Diwali Discount Offer On Alto, S-Presso, Wagon R, Swift And More Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X