Just In
Don't Miss
- News
డీఎంకెతో ఎంఐఎం పొత్తు..? కుదరకపోతే ఒంటరిగానే... తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ పనిచేస్తుందా?
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
మారుతి సుజుకి భారత మార్కెట్లో స్విఫ్ట్ లిమిటెడ్-ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో లభిస్తుంది. ఈ కాదు ధర స్టాండర్డ్ మోడల్ కంటే కేవలం 24,990 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. మారుతి స్విఫ్ట్ లిమిటెడ్-ఎడిషన్ ప్రారంభ ధర రూ. 5.44 లక్షలు[ఎక్స్-షోరూమ్,ఢిల్లీ].

మారుతి స్విఫ్ట్ లిమిటెడ్-ఎడిషన్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ ఏఎంటి, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఏఎంటి, జెడ్ఎక్స్ఐ ప్లస్ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎంటి అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ. 5.44 లక్షల నుంచి రూ. 8.27 లక్షల వరకు ఉంటాయి [ఎక్స్-షోరూమ్,ఢిల్లీ].

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ అనేక కాస్మొటిక్ చేంజెస్ కలిగి ఉంటుంది. ఎక్స్టీరియర్స్ మాత్రమే కాకుండా ఇంటీరియర్స్ కూడా కొంత నవీనీకరించబడింది. ఇందులో జరిగిన అప్డేట్స్ మనం గణనించినట్లైతే గ్లోస్-బ్లాక్ బాడీ కిట్ సైడ్ మోల్డింగ్, డోర్ విజర్ మరియు రియర్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.
MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్స్ మరియు టైల్లైట్స్‌పై గ్లోస్-బ్లాక్ గార్నిష్‌తో హ్యాచ్‌బ్యాక్ వస్తుంది. స్టాండర్డ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఇంటీరియర్‌లలో ఇప్పుడు బ్లాక్ సీట్ కవర్లు ఉన్నాయి. ఇవి స్పోర్టి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు రౌండ్ డయల్‌లకు సరిపోతాయి.

ఈ మార్పులు కాకుండా ఇందులో ఇతర మార్పులు లేవు. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ దాని స్టాండర్డ్ వేరియంట్ల నుండి అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇందులో ఉన్న స్టాండర్డ్ ఫీచర్స్ గమనించినట్లయితే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మారుతి సుజుకి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ‘స్మార్ట్‌ప్లే స్టూడియో', ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి
కొత్త లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 82 బిహెచ్‌పి మరియు 113 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. హయ్యర్ వేరియంట్లు అప్సనల్ AMT ట్రాన్స్మిషన్ యూనిట్ తో కూడా వస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మారుతి సుజుకి తన స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో పండుగ సీజన్‌కు ముందే ప్రవేశపెట్టారు. స్విఫ్ట్‌లోని కొత్త లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను పెంచడానికి మరింత సహాయపడుతుంది. ఇప్పటికే భారత మార్కెట్లో మారుతి స్విఫ్ట్ అత్యధిక అమ్మకాలను సాగించింది.
MOST READ:వావ్.. హైవేపై అద్భుతం.. డ్రైవర్ లేకుండా నడుస్తున్న కార్ [వీడియో]