హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

మారుతి సుజుకి తమ మారుతి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద సంచలన నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీని స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మారుతి బ్రిజా హైబ్రిడ్ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ డ్రైవ్‌స్పార్క్ తీసుకొచ్చింది.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మారుతి బ్రిజా పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసి, డీజల్ వేరియంట్లను అమ్మకాల నుండి తొలగించనున్నట్లు తెలిసింది.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

దీనికి తోడు, పెట్రోల్ వేరియంట్లకు కొనసాగింపుగా.. బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ వేరియంట్లో ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. మారుతి ఇటీవల వితారా బ్రిజా ఎస్‌యూవీ హైబ్రిడ్ మోడల్‌ను రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా సేకరించిన ఫోటోలు కూడా ఈ వార్త నిజమే అంటున్నాయి.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

2020 మారుతి వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో పలు మార్పులు కూడా జరుగుతున్నాయి. మారుతి ఇంజనీర్లు ఈ మోడల్‌కు క్రాసోవర్ ఎస్‌యూవీ లుక్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. రియర్ డిజైన్‌లో అత్యాధునిక టెయిల్ ల్యాంప్ క్లస్టర్, బంపర్‌లో ఫాక్స్ డిఫ్యూజర్ మరియు సిల్వర్ హైలెట్స్ స్థానంలో బ్లాక్ ఫినిషింగ్స్ వస్తున్నాయి.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

మారుతి వితారా ఫేస్‌లిఫ్ట్‌లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందిస్తున్నారు. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి (SHVS) అనే హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో తీసుకొస్తున్నారు. SHVS బ్యాడ్జ్‌తో వచ్చే వితారా బ్రిజాలో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) కూడా అందిస్తున్నారు.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఫియట్ నుండి సేకేరిస్తున్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అయితే ఎర్టిగా మరియు సియాజ్ కార్లలో సక్సెస్ అయిన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను బ్రిజా ఫేస్‌లిఫ్ట్‌లో కొనసాగించనున్నారు.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

ఎర్టిగా మరియు సియాజ్ హైబ్రిడ్ కార్లలో ఉన్నటువంటి 12V హైబ్రిడ్ సిస్టమ్ స్థానంలో శక్తివంతమైన 48V హైబ్రిడ్ వ్యవస్థను అందిస్తున్నారు. పెట్రోల్ ఇంజన్‌కు అదనంగా తోడయ్యే 48V DC కన్వర్టర్ గరిష్టంగా 235ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ బ్రిజా పెట్రోల్‌తో పోల్చుకుంటే మైలేజ్ 15% పెరుగుతుంది.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

వితారా బ్రిజా హైబ్రిడ్ వేరియంట్ సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే మరింత శక్తివంతమైనది కూడా. 2020 వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. స్టార్టింగ్ వేరియంట్లు మాత్రం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

మారుతి వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్‌లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెగ్యులర్ 1.2-లీటర్ ఇంజన్ కంటే దీని పర్ఫామెన్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో డీజల్ వేరియంట్లను తొలగించి చీపెస్ట్ ధరలోనే క్రాసోవర్ తరహా పర్ఫామెన్స్ అందించేందుకు మారుతి ప్రయత్నిస్తోంది.

హైబ్రిడ్ ఇంజన్‌తో మారుతి బ్రిజా: ప్లాన్ అదిరింది!

2020 మారుతి సుజుకి వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పూర్తి స్థాయిలో విడుదల కానుంది. ఇంజన్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలతో పాటు ఇంటీరియర్‌లో కూడా మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎన్నో అత్యాధునిక ఫీచర్లు రానున్నాయి. ఆటో ఎక్స్‌పోకు సంభందించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి...

Source: Rushlane

Most Read Articles

English summary
Maruti-suzuki-vitara-brezza-petrol-spotted-ahead-of-launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X