ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రఖ్యాతిగడించిన వాహనం వోక్స్‌వ్యాగన్ బీటిల్. అయితే వీటి మార్కెట్ బాగా తగ్గిపోయింది. వీటిని ఇప్పుడు వినియోగించే వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ని వోల్క్స్ వాగన్ బీటిల్ కార్ గా మార్చిన ఉదంతం మనకు మధ్యప్రదేశ్ లో కనిపిస్తుంది. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ని వోక్స్‌వ్యాగన్ బీటిల్ కార్ గా మధ్యప్రదేశ్ లో మాగ్నటో చేత తయారు చేయబడింది. ఇంతకుముందు కూడా ఇదే గ్యారేజ్ లో ఇలాంటి పరివర్తనలు చాలానే జరిగాయి. ఈ విధంగా తయారు చేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా సృష్టించడం వల్ల ఒక అనుభవం ఉంటుంది. ఈ తీవ్రమైన ఉత్సాహంచేతనే ఈ అరుదైన కార్ తయారుచేయబడింది.

ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

వీడియో ప్రకారం ఈ కార్ని తయారు చేయడానికి వారికి 10 నుండి 12 రోజుల సమయం పట్టింది. వాహనం యొక్క బాడీ హెవీ గేజ్ షీట్ లోహంతో తయారు చేయబడింది. ఇంకా ఇందులో చివరి దాకా సరైన జాగ్రత్తలు తీసుకుని తయారుచేయబడింది అని మనకు ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది.

ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

ఈ కారు నాలుగు సీట్లు కలిగి ఉంటుంది. కానీ ఇప్పుడు అది రరెండు తలుపులను కోల్పోయింది. ఈ కారు కాంపాక్ట్ గా కనిపిస్తుంది. ఈ వాహనానికి ఒరిజినల్ లుక్ ఇవ్వడానికి హెడ్ లాంప్స్ మరియు టెయిల్ లాంప్స్ లు మాత్రం వోక్స్‌వ్యాగన్ కారువే ఉపయోగించారు. ఇవి చాల బాగా పనిచేస్తాయి. ఇందులోని క్యాబిన్లు ఎరుపు మరియు నలుపు రంగులను కలిగి ఉంటాయి. ఇది చూడటానికి చాల ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా జోడించబడి ఉంటుంది. వాహనానికి ప్రీమియం అనుభూతిని జోడించడానికి, ఇది పుష్-స్టార్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. కానీ దీనిని స్టార్ట్ చేయడానికి కీ ని ఉపయోగించాల్సి ఉంటుంది. వాహనంలో ఇంజిన్ అలాగే ఉంటుంది. ఇది 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో వాహనం యొక్క మెకానికల్స్‌కు సంబంధించి ఎటువంటి మార్పు చేయలేదు.

ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?

ఈ విధంగా రూపాంతరం చెందిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ ధర రూ. 4.5 లక్షలు. కాని దాత కారు ధరను ఇందులో చేర్చారో లేదో మనకు పూర్తిగా తెలియదు. ఈ వాహనానికి ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వ్యక్తి కూడా వారు గత తరం మారుతి సుజుకి వాగన్ఆర్ పై ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేశారని, వినియోగదారుడు కోరుకుంటే వేరే ఏ వాహనానికైనా ఈ విధంగా చేయగలను అని చెప్పారు. అలా కాకుండా ప్రత్యేకించి ఆర్టీఓ గురించి మరియు గ్యారేజ్ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ వంటి వాటికి వారిదగ్గర ఎక్కువ సమాచారం అందుబాటులో లేదని చెప్పారు.

Read More:2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

సాధారణంగా ఇటువంటి మార్పులు భారతదేశంలో చట్టబద్దమైనవి కావు. ఒకవేళ ఇలాంటి నిర్మాణాలు చేస్తే వాహనానికి కొన్ని చట్టబద్దమైన RC లో కొన్ని మార్పులు అవసరమవుతాయని మనం గమనించాలి. ఢిల్లీ, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాలలో ఇటువంటి భారీ మార్పులు చేసిన వాహనాలు వెంటనే స్వాధీనం చేసుకోబడతాయి. ఇటువంటి వాహనాలు తాయారు చేసిన కొన్ని నియమ నిబంధనలు పాటించి వీటిని వినియోగించుకోవచ్చు.

Image Courtesy: MAGNETO 11/YouTube

Most Read Articles

English summary
This Volkswagen Beetle is actually a Maruti Swift-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X