Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాసేరటి ఎమ్‌సి20 సూపర్ కార్ ఆవిష్కరణ; ఫీచర్లు, వివరాలు
ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ మాసేరటి తమ అధునాతన సూపర్‌కార్ ఎమ్‌సి20ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. మాసేరటి ఎమ్‌సి20 పేరులో ఎమ్‌సి20 అంటే మాసేరటి కోర్స్ 2020 అని, ఇది తమ బ్రాండ్ కొత్త యుగంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుందని కంపెనీ తెలిపింది. ఎమ్‌సి12 డిజైన్‌ను ప్రేరణ పొంది ఎమ్‌సి20ని అభివృద్ధి చేశారు.

మాసేరటి ఎమ్‌సి20లో మోడెనాలో మాసేరటి అభివృద్ధి చేసిన నెట్యూనో అనే కొత్త వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ సరికొత్త ఇంజన్ హైలైట్ ఏంటంటే, ఇది పేటెంట్ పొందిన ఎఫ్1 టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది మరియు ప్రీ-కంబస్టియన్ చాంబర్‌ను కలిగి ఉంటుంది.

ఈ సూపర్ కారులోని 3.0 లీటర్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 622 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3000-5500 ఆర్‌పిఎమ్ మధ్యలో 730 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ అవుతుంది.
MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

ఈ ఇటాలియన్ ఎమ్‌సి20 సూపర్ కార్ కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో పరుగువలు తీయగలదు. దీని గరిష్టం గంటకు 325 కిమీ. మాసేరటి ఎమ్‌సి20లో లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ ఆప్షన్‌తో పాటుగా ఆప్షనల్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్‌ను కూడా కలిగి ఉంటుంది.

మాసేరటి ఎమ్‌సి20 డిజైన్ విషయానికి వస్తే, ఇది చాలా స్లీక్‌గా ఉంటుంది. ఈ కారు అధిక వేగాన్ని తట్టుకునేందుకు వీలుగా, ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను ఆఫర్ చేయటం కోసం కారు వెనుక భాగాన్ని చక్కగా డిజైన్ చేశారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది మెరుగైన ఏరోడైనమిక్స్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:వైద్య వృత్తిని విడిచిపెట్టి ఆటో డ్రైవర్‌గా మారిన గవర్నమెంట్ డాక్టర్, ఎందుకో తెలుసా ?

కారు ముందు భాగంలో గ్రిల్‌కు ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఏరోడైనమిక్ సామర్థ్యం కోసం ఫ్రంట్ హుడ్‌కి ఇరువైపులా రెండు స్కూప్‌లతో పాటు గ్రిల్ మధ్యలో భారీ మాసేరటి లోగోను ఉంచారు.

కారు వెనుక భాగంలో సొగసైన డిజైన్, షార్ప్ అండ్ అగ్రెసివ్‌గా కనిపించే టెయిల్ ల్యాంప్స్, రియర్ డిఫ్యూజర్, ట్విన్ ఎగ్జాస్ట్ మరియు రియర్ స్పాయిలర్‌లను గమనించవచ్చు. ఈ మిడ్-ఇంజన్ సూపర్ కారులో బట్టర్‌ఫ్లై డోర్స్ మరియు రాడికల్ డిజైన్‌తో తయారు చేసిన 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.
MOST READ:స్కోడా రాపిడ్ టిఎస్ఐ మోంటే కార్లో ఎడిషన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. వచ్చేసింది

మాసేరటి ఎమ్‌సి20 సూపర్ కారు బరువును తేలికగా ఉంచేందుకు, దీని నిర్మాణంలో చాలా వరకూ కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు. ఫలితంగా, ఎమ్‌సి20 మొత్తం బరువు 1500 కిలోగ్రాముల కంటే తక్కువగానే ఉంటుంది. ఇది కారు 621 బిహెచ్‌పి పవర్‌తో కలిపి మంచి పవర్ టూ వెయిట్ రేషియోని ఆందిస్తుంది.

కారు ఇంటీరియర్స్‌ని గమనిస్తే, ఇందులో బ్లూ అండ్ బ్లాక్ థీమ్‌తో డిజైన్ చేసిన క్యాబిన్ క్లీన్‌గా చాలా లగ్జరీగా అనిపిస్తుంది. స్పోర్టీ లుక్ కోసం ఇందులో రేసింగ్ బకెట్ సీట్లను అమర్చారు, ఈ సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్ ఉంటుంది.
MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

అంతేకాకుండా, క్యాబిన్ రోపల రెండు 10.25 ఇంచ్‌ల స్క్రీన్‌లు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ గానూ మరొకటి ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే గానూ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు మాసేరటి ఇంటెలిజెంట్ అసిస్టెంట్ (ఎమ్ఐఏ) వంటి కనెక్టింగ్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇంకా ఇందులో ఆల్కాంటారా ఫినిష్డ్ అప్‌హోలెస్ట్రీ, డిజిటల్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్, దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, సోనోస్ నుండి సేకరించిన సిక్స్-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, కార్బన్ ఫైబర్లో ఫినిష్ చేసిన సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ప్యాడల్-షిఫ్టర్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మాసేరటి ఎమ్‌సి20లో మొత్తం ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి: వెట్, జిటి, స్పోర్ట్, కోర్సా మరియు ఈఎస్‌సి ఆఫ్. ఈ డ్రైవింగ్ మోడ్‌లను సెంటర్ కన్సోల్ ఉన్న నాబ్ ద్వారా నియంత్రించవచ్చు. ఇందులో ప్రతి డ్రైవ్ మోడ్‌ను ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై దాని రంగు ద్వారా గుర్తించవచ్చు.

మాసేరటి ఎమ్‌సి20 కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది బియాంకో ఆడేస్ (ఎల్లోయిష్ / వైట్), జియాల్లో జెనియో (బ్లూ / ఎల్లో), రోసో విన్సెంట్ (ఎరుపు), బ్లూ ఇన్ఫినిటో (బ్లూ), నీరో ఎనిగ్మా (బ్లాక్) మరియు గ్రిజియో మిస్టెరో (డార్క్ గ్రే) ఉన్నాయి.

ఇటలీలోని మోడెనాలోని మాసేరటి ఫ్యాక్టరీలో ఈ ఎమ్‌సి 20 సూపర్ కారును ఆవిష్కరించారు. కొత్త ఎమ్‌సి 20 సూపర్ కార్ల తయారీకి అనుగుణంగా సంస్థ తమ ప్లాంట్‌ను అత్యాధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కారు వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర 2,00,000 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.

మాసేరటి ఎమ్‌సి20 సూపర్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
అత్యుత్తమ లగ్జరీ కార్లను, సూపర్ కార్ల విభాగంలో ఇటాలియన్ బ్రాండ్ మాసేరటి ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని కలిగి ఉంది. ఎమ్‌సి20 డిజైన్ పరంగా దాని ముందు మోడల్ నుండి ప్రేరణ పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. గొప్ప రేసింగ్ వారసత్వాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక పరికరాలు మరియు ఫీచర్లను కలగలపి ఓ కొత్త శకానికి నాంది పలికేలా ఈ కొత్త ఎమ్‌సి20 సూపర్ కారును తయారు చేశారు.