ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎమ్‌జి మోటార్స్ భారత్‌లో తమ తన నాలుగవ ఉత్పత్తిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ విక్రయిస్తున్న మాక్సస్ డి90 మోడల్ ఆధారంగా చేసుకొని ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం అభివృద్ధి చేస్తున్న ఎమ్‌జి గ్లోస్టర్‌ను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఎమ్‌జి మోటార్స్ తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో గ్లోస్టర్ ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది. గ్లోస్టర్‌ను భారత మార్కెట్లో మిగిలిన మూడు ఉత్పత్తుల మాదిరిగా కాకుండా లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటి ధరలతో పోలిస్తే ఎమ్‌జి గ్లోస్టర్ ధర చాలా ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

తాజాగా, ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీకి సంబంధించిన చిత్రాలనుఆటోకార్ ఇండియా లీక్ చేసింది. ఈ మోడల్‌ను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా, ఇప్పటికే అనేక సార్లు కెమెరాకు చిక్కింది. ఇంటీరియర్ చిత్రాలను గమనిస్తే, లోపలి భాగంలో డ్యూయెల్-టోన్ కలర్ స్కీమ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి దీనిని ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీతో డిజైన్ చేశారు.

MOST READ: భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఇంకా ఇందులో బ్రష్డ్ అల్యూమినియం యాక్సెంట్స్ 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, యాచ్-స్టైల్ గేర్ సెలెక్టర్ లివర్, పాడిల్ షిఫ్టర్స్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ వంటి అనేక ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఈ ఎస్‌యూవీలోని వెనుక వరుసలో కూర్చునే ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు, మూడవ వరుసలో బెంచ్ సీట్ ఫీచర్లు ఉన్నాయి. ఎమ్‌జి గ్లోస్టర్ 7 సీటర్ మరియు 8 సీటర్ సామర్థ్యాలతో అందుబాటులోకి రావచ్చని అంచనా.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఎమ్‌జి గ్లోస్టర్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ముందు భాగంలో పెద్ద ఎమ్‌జి బ్యాడ్జ్‌తో కూడిన అక్టాగనల్ క్రోమ్ గ్రిల్ ఉంటుంది. ఇంకా ఇందులో ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్స్, బంపర్‌పై అమర్చిన ఫాగ్‌ల్యాంప్స్ మరియు దానిచుట్టూ క్రోమ్ గార్నిష్, క్రోమ్‌తో ఫినిష్ చేసిన బోల్డ్ విండో లైన్, ఫ్రంట్ స్కఫ్ ప్లేట్స్, సైడ్‌స్టెప్ మరియు పెద్ద సిక్స్-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 220 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్ఎఫ్ నుండి గ్రహించిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ప్రస్తుతానికి ఎమ్‌జి గ్లోస్టర్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది, ఇందులో పెట్రోల్ ఇంజన్ తరువాతి దశలో రావచ్చని అంచనా. ఈఏడాది పండుగ సీజన్‌లో ఎమ్‌జి గ్లోస్టర్ ఎప్పుడైనా విడుదల కావచ్చని సమాచారం.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ లీక్; త్వరలో భారత్‌లో విడుదల

ఎమ్‌జి గ్లోస్టర్ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇది వరకు చెప్పుకున్నట్లు ప్రస్తుతం ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్ఎస్ ఈవి వానాలతో పోల్చుకుంటే, ఈ కొత్త గ్లోస్టర్ ధర చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కాబోతున్న ఎమ్‌జి గ్లోస్టర్ ఈ విభాగంలో ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, స్కొడా కోడియాక్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Source: Autocar India

Most Read Articles

English summary
MG Motor is gearing up to launch its fourth product in the Indian market, the Gloster, which is based on the Maxus D90 that is sold internationally. MG showcased the Gloster for the first time at the 2020 Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X