2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి సేల్స్ ఎంతో తెలుసా.. !

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎంజి మోటార్స్ ఇండియా ఇండియన్ మార్కెట్లో జెడ్ఎస్ ఎలిక్ట్రిక్ వెహికల్ యొక్క అమ్మకాలు గణాంకాలను ప్రకటించింది. ఈ ఎంజి జెడ్ఎస్ యొక్క ఫిబ్రవరి అమ్మకాలు ఎలా ఉన్నాయో ఒక సారి పరిశీలిద్దాం..

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

ఎంజి మోటార్ ఇండియా ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన జెడ్ఎస్ ఇవి అమ్మకాల గణాంకాలను ప్రకటించింది. ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఫిబ్రవరి నెలలో మొత్తం దాదాపు 158 యూనిట్లను నమోదు చేశాయి. 2020 జనవరిలో ప్రారంభించిన జెడ్‌ఎస్ ఇవి ప్రారంభ ధర రూ. 20.88 లక్షలతో (ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ) అందించబడుతుంది.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

శాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ యాజమాన్యం ప్రకారం బ్రిటీష్ బ్రాండ్ కూడా ఇండియన్ మార్కెట్లో జెడ్ఎస్ ఇవి అమ్మకాలు దాదాపు 3000 యూనిట్లు నమోదు చేసినట్లు ప్రకటించారు. అంటే ఇది 2019 లో భారతదేశంలో విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కంటే ఎక్కువ.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

ఎంజి మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ "రాకేశ్ సిదానా" మాట్లాడుతూ, ఎంజి జెడ్ఎస్ ఇవి మొదటి నెలలోనే అద్భుతమైన అమ్మకాలను చేపట్టిందని, ఇప్పటికే దాదాపు 150 కి పైగా వాహనాలను వినియోగదారులకు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. రాబోయే నెలలలో కూడా ఈ ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క అమ్మకాలను పెంచడమే కంపెనీ యొక్క లక్ష్యం అని తెలియజేసారు. అంతే కాకుండా ఇంకా చాలామంది వినియోగదారులను ఆకర్షించే విధంగా సన్నాహాలను సిద్ధం చేస్తామని తెలియజేసారు.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

ఎంజి జెడ్ఎస్ ఇవి అనేది భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క తాజా ఉత్పత్తి. జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

ఎంజి జెడ్ఎస్ యొక్క అమ్మకాల గణాంకాలతోపాటు కంపెనీ కరోనా వైరస్ వల్ల ఉత్పత్తిలో ఏర్పడిన అంతరాయం గురించి కూడా తెలిపింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తివల్ల చాల కంపెనీలు ఉత్పత్తులు తగ్గిపోయాయని కూడా తెలియజేసింది. ఫిబ్రవరి నెలలో అమ్మకలకు కొన్ని అంతరాయాలు కలిగినప్పటికీ, మార్చి నెలలో మాత్రం ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉందన్నారు.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

కరోనా వైరస్ యొక్క వ్యాప్తి యూరోపియన్ మరియు చైనీస్ సరఫరాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ వైరస్ ఫిబ్రవరి నెలలోని అమ్మకాలపై ప్రభావం చూపించడమే కాకుండా దీని ప్రభావం మార్చిపై కూడా కొంత ఉండే అవకాశం ఉందన్నారు. ఏది ఏమైనా మార్చిలో అమ్మకాలు గణనీయమైన పురోగతిని చూపించడానికి కృషి చేస్తామని సిదానా తెలియజేశారు.

2020 ఫిబ్రవరిలో ఎంజి జెడ్ఎస్ ఇవి అమ్మకాలు ఎంతో తెలుసా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ కనెక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనం. ఇది మిడ్ సైజు ప్రీమియం ఎలక్ట్రిక్ ప్రొడక్ట్. ఈ ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ ఇండియన్ మార్కెట్లో, హ్యుందాయ్ కోనా ఇవి కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
MG ZS EV Sales In India For February 2020: Company Registers 158 Units In First Month Of Sales. Read in Telugu.
Story first published: Monday, March 2, 2020, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X