ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పది లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ భయంకరమైన వైరస్ వల్ల 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

కరోనా వైరస్ భారతదేశంలో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఎక్కువ మంది ప్రజలు ఈ వైరస్ భారిన పడకుండా ఉండటానికి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయబడింది.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ ఫలితంగా ఆటో మొబైల్ సహా అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. ఈ కారణంగా ఆటో పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ సందర్భంలో ఎంజి మోటార్ కంపెనీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎంజి మోటార్ తన కంపెనీ ఉత్పత్తులను నిలిపివేసినప్పటికీ కంపెనీలో పనిచేసే ఏ ఒక్కరిని తొలగించబోమని ప్రకటించింది.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

దీని గురించి ట్వీట్ చేస్తూ ఎంజి మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ 2020 నాటికి ఉద్యోగ కోతలు ఉండవని పేర్కొన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా ఎంజీ మోటార్ ఎవరిని పనినుండి తొలగించబోమని ప్రకటించారు.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

ఎంజీ మోటార్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలని ప్రజలు ఇతర సంస్థలను కూడా కోరుతున్నారు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ లో ఉన్నప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు వేతనం ఇవ్వడం వల్ల ఈ సమయంలో వారికి అండగా ఉన్నట్లు అవుతుంది.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

ఎంజీ మోటర్స్ కంపెనీ ఉద్యోగులు ఈ నిర్ణయంతో వల్ల చాలా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఎంజీ మోటార్ కంపెనీ ఇప్పటికే రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చింది. అదనంగా ఎంజి మోటార్ తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు కూడా తయారు చేస్తుంది.

ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !

క్రిమిసంహారక మందులు ఉపయోగించిన తరువాత ఎంజి మోటార్ తన కార్లను పంపిణీ చేస్తోంది. దీని కోసం కంపెనీ క్రిమిసంహారక మందులు ఉపయోగించిన తరువాత వీరి యొక్క వాహనాలను డెలివరీ చేయడం కూడా జరుగతుంది. ఏది ఏమైనా ఎంజి మోటార్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కంపెనీలో ఉన్న ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు.

Most Read Articles

English summary
MG Motor announces no job cut in 2020 amidst Covid 19 pandemic. Read in Telugu.
Story first published: Saturday, April 4, 2020, 18:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X