Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత ప్రభుత్వానికి సహాయంగా ఎంజీ మోటార్స్ ప్రకటించిన విరాళం ఎంతంటే.. ?
దేశ వ్యాప్తంగా రోజా రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. ప్రపంచదేశాలన్ని ఈ కరోనా వైరస్ ప్రభావానికి లోనై చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఎట్టకేలకు భారత ప్రభుత్వం ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇటీవల కాలంలో "జనతా కర్ఫ్యూ" విధించడం కూడా జరిగింది. కానీ ఈ వైరస్ ని పూర్తిగా రూపు మాపడానికి మన ప్రధాని నరేంద్రమోడీ 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు.

ఈ రోజు భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ప్రజల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. ఏది ఏమైనా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితులను ఎదొర్కొవడానికి ప్రభుత్వానికి మద్దతుగా చాలామంది ముందుకు వచ్చారు. సినిమా రంగాలకు చెందిన వారు, క్రేడా రంగానికి చెందిన వారు కూడా తమ మద్దతును తెలపడమే కాకుండా కొంత డబ్బును కూడా విరాళంగా ఇచ్చారు.

అతి తక్కువ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన ఆటో మొబైల్ పరిశ్రమ అయిన ఎంజి మోటార్స్ కరోనా వైరస్ నివారణకు మద్దతు ప్రకటించడమే కాకుండా 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.

భయంకరమైన ఈ వైరస్ నివారణకు భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా కొన్ని నిత్యావసర వనరులు అవసరమని గ్రహించడం వల్ల కంపెనీ తన ఉదారతను చాటుకుంది. ఈ డబ్బును గురుగ్రామ్ మరియు వడోదరలోని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు ఉపయోగించుకుంటాయి.

ఈ డబ్బు ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థలకు చాలా అవసరమైన వైద్య పరికరాలను పొందటానికి అనుమతిస్తుంది. ఇందులో మాస్క్ లు, హ్యాండ్ గ్లౌసెస్, మెడిసిన్స్, బెడ్స్ మరియు వెంటిలేటర్ల కోసం మాత్రమే కాకుండా ఇతర వైద్య సహాయం కోసం ఉపయోగిస్తారు. ఈ 2 కోట్ల విరాళంతో 1 కోటి రూపాయలు కంపెనీ సమకూర్చుతారు. మిగిలిన కోటి రూపాయలు కంపెనీ ఉద్యోగులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎంజి మోటార్స్ సంస్థ తమ ఉద్యోగుల భద్రతకు కూడా భరోసా ఇస్తోంది. షోరూమ్‌లో టెస్ట్ డ్రైవ్‌లకు అందుబాటులో ఉన్న కార్లు సరైన భద్రతా నియమాలను అనుసరిస్తున్నట్లు ఎంజి మోటార్స్ ఇటీవల ప్రకటించింది. భారతదేశం అంతటా తమ 5000 మంది ఉద్యోగులకు మెరుగైన బీమా కవర్లను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారత ప్రభుత్వం తదుపరి నోటీసు ఇచ్చే వరకు కార్లు మరియు మోటార్ సైకిల్స్ ఉత్పత్తులను దాదాపు అన్ని కంపెనీలు నిలిపివేశాయి. మరి కొన్ని కంపెనీలు ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థలకు మద్దతుగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రారంభించాయి.

దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ డీలర్‌షిప్‌లు, సర్వీస్ స్టేషన్లు మూసివేయబడ్డాయి. అవసరమైన సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు తమ మిగిలిపోయిన బిఎస్ 4 వాహన స్టాక్‌లతో కూడా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల రూ. 6,400 కోట్లకు పైగా విలువైన బిఎస్ 4 వాహనాలు అమ్ముడుపోలేదు.

ఏది ఏమైనా ఎట్టకేలకు భారత ప్రభుత్వం ప్రజలు క్షేమం కోసం లాక్ డౌన్ విధించింది. దీనికి మద్దతుగా అందరి సహకారం అవసరం. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ సహకరించి ఇంట్లోనే ఉంటూ అందరి మద్దతు తెలిపి కరోనా వైరస్ నివారణలో పాలు పంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.