వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ [MG ZS] పెట్రోల్ ఎస్‌యూవీ!

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎమ్‌జి మోటార్స్ ఇండియా, ఇటీవలే తమ కొత్త గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే భారత్‌లో ఎమ్‌జి హెక్టర్, హెక్టర్ ప్లస్, జిఎస్ ఈవి కార్లను విక్రయిస్తున్న ఎమ్‌జి మోటార్స్ మరికొద్ది రోజుల్లోనే తమ నాల్గవ ఉత్పత్తి గ్లోస్టర్‌ను విడుదల చేయనుంది.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

కాగా.. వచ్చే ఏడాది భారత మార్కెట్‌లో తమ ఐదవ ఉత్పత్తిని కూడా విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎమ్‌జి మోటార్స్ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ వెర్షన్ ఎమ్‌జి జిఎస్[MG ZS] మోడల్‌లో కంపెనీ ఓ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఎక్స్‌ప్రెస్ డ్రైవ్స్ నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, మోరిస్ గ్యారేజ్ (ఎమ్‌జి) ఇండియా తమ ఐదవ ఉత్పత్తిని వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని చూస్తోంది. అదే నివేదికలో, ఈ కొత్త ఉత్పత్తిని దేశంలోని మాస్-మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని విడుదల చేయానిల కంపెనీ భావిస్తున్నట్లు కూడా పేర్కొనబడి ఉంది.

MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

కంపెనీ నుంచి రానున్న జిఎస్ పెట్రోల్ పవర్డ్ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హెక్టర్ ధర కంటే సరసమైనదిగా ఉంటుందని ఎమ్‌జి మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారతదేశంలో హెక్టర్ ప్రారంభ ధర రూ.12.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే, ఈ కొత్త ఎస్‌యూవీ ధర అంత కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఈ ఊహాగానాలకు మరింత బలం జోడిస్తూ, ఎమ్‌జి మోటార్స్ ఇండియా, ఇప్పటికే భారత మార్కెట్లో పెట్రోల్‌తో నడిచే జిఎస్ మోడల్‌ను విస్తృతంగా పరీక్షిస్తోంది. టెస్టింగ్ దశలో ఇప్పటికే ఈ ఎస్‌యూవీ పలుమార్లు కెమరాకు కూడా చిక్కింది. డిజైన్ పరంగా జిఎస్ ఎస్‌యూవీ చిన్నదిగా ఉండి, హెక్టర్ బ్రాండ్‌కు దిగువన విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:పోలీసులతో గొడవపడిన జొమాటో డెలివరీ గర్ల్, తర్వాత ఏం జరిగిందంటే ?

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఇంతకుముందు లీకైన డాక్యుమెంట్ ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ దేశంలో జిఎస్ మోడల్‌ను పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసే అకాశం ఉందని కూడా వెల్లడైంది. ఎమ్‌జి మోటార్స్ ఇప్పటికే ఈ ఎస్‌యూవీ వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విభిన్న ఇంజన్ ఆప్షన్లతో కంపెనీ విక్రయిస్తోంది.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఈ ఇంజన్ ఆప్షన్లలో ఒకటి 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, ఇది గరిష్టంగా 109.4 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:స్కోడా సూపర్బ్ స్పోర్ట్ లైన్ సెడాన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఈ రెండు ఇంజన్లు ఇప్పటికే యూరో-6 ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఇవి మనదేశంలో బిఎస్6 నిబంధనలకు సమానమైన ఉద్గార ప్రమాణం. దీన్ని బట్టి చూస్తుంటే, ఎమ్‌జి మోటార్స్ ఈ రెండు ఇంజన్ ఆప్షన్లను భారత మార్కెట్లో విడుదల చేయటానికి లైన్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికొస్తే, సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే గ్లోబల్-స్పెక్ మోడల్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ మాత్రం సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. భారత మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌లో కూడా ఇదే రకమైన గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా.

MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఎమ్‌జి జిఎస్ [MG ZS] గ్లోబల్ వెర్షన్ ఎస్‌యూవీలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో కూడిన బ్రాండ్ యొక్క సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్ ఉంటుంది. రెండు చివర్లలో ఉంచిన అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌లతో వ్రాప్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, గ్లోబల్ వెర్షన్ ఎస్‌యూవీలో క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని అందించే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క తాజా ఐస్‌మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.

దేశంలో హెక్టర్ మరియు ఎమ్‌జి జిఎస్ ఈవి మోడళ్ల లోకలైజేషన్‌ను కూడా పెంచాలని కంపెనీ చూస్తోందని ఈ నివేదికలో తేలింది. పవర్‌ట్రెయిన్‌ను బట్టి హెక్టర్ లోకలైజేషనే 70 నుంచి 75 శాతం మధ్యలో ఉంటుందని అంచనా.

వచ్చే ఏడాది భారత్‌లో విడుదల కానున్న ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ!

ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని వేగంగా విస్తరించుకోవటం ద్వారా బ్రాండ్ అమ్మకాలను గరిష్టంగా పెంచుకోవాలని ఎమ్‌జి మోటార్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రీమియం, లగ్జరీ ఎస్‌యూవీ విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తూ వచ్చిన కంపెనీ, ఇప్పుడు మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని సరసమైన ధరకే ఓ ఎస్‌యూవీని తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని అంచనా.

Most Read Articles

English summary
MG Motor India recently unveiled its flagship Gloster premium-SUV in the country. The Gloster SUV is ideally the brand's third model that will be launching later in the year in India, after the Hector and the MG ZS EV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X