జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఎంజీ మోటార్ సరికొత్త జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. ఎంజీ మోటార్ తమ సెకండ్ మోడల్ జడ్ఎస్ ఇవి కారును జనవరి 27 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

చైనా కంపెనీ సొంతం చేసుకున్న బ్రిటన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ మోరిస్ గ్యారేజస్ మోటార్ (ఎంజీ మోటార్) తమ ఫస్ట్ మోడల్ హెక్టార్ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్న సెకండ్ మోడల్ ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. కస్టమర్లు ఇప్పుడు 50 వేల రూపాయలు చెల్లించి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న ఇతర పెట్రోల్/డీజల్ మోడళ్లకు ధీటైన పనితీరు కనబరిచే ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్‌లో 44.5kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్ గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది సుమారుు 143బిహెచ్‌పి పవర్ మరియు 353ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింగల్ ఛార్జింగ్‌తో ఏకంగా 340కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీలో అందించిన ఎన్నో వరల్డ్ క్లాస్ ఫీచర్లను జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో యధావిధిగా అందిస్తున్నారు. అందులో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వచ్చాయి.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

17-ఇంచుల అల్లాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్లు స్టాండర్డ్‌గా వచ్చాయి. టాప్ ఎండ్ వేరియంట్లలో అయితే, పానరొమిక్ సన్‌‌రూఫ్, లెథర్ సీట్లు, ఎలక్ట్రిక్ పవర్‌‌తో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు మరియు ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. రెండు వేరియంట్లలో కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డిసెంట్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా మరియు రియర్ సెన్సార్లు తప్పనిసరి ఫీచర్లుగా వచ్చాయి.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఛార్జింగ్ విషయానికి వస్తే, 50kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 50 నిమిషాల్లోనే 0-80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ పాయింట్లను దేశవ్యాప్తంగా ఉన్న ఎంజీ డీలర్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేశారు. దీంతో పాటు 7.4kW AC ఛార్జర్‌తో 6-8 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

ఎంజీ మోటార్ ప్రస్తుతానికి జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీని తొలు ఐదు నగరాల్లో మాత్రమే విక్రయించనుంది. ఢిల్లీ, ముంబాయ్, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్. ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధాారంగా ఇతర నగరాలకు జడ్ఎస్ ఇవి సేల్స్ విస్తరిస్తారు.

జనవరి 27న వస్తున్నా సిద్దంగా ఉడండి.. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జనవరి 27న అమ్మకాలకు సిద్దంగా మార్కెట్లోకి రానున్న ఎంజీ జడ్ఎస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 22 లక్షల వరకు ఉండవచ్చు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సరాసరి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
MG ZS EV India Launch Date Confirmed: Here Are All The Details! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X