మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

దిగ్గజ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్ల తయారీ దిగ్గజం మినీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎడిషన్‌లో మినీ క్లబ్‌మ్యాన్ కారును విడుదల చేసింది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ ధర రూ. 44.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఖరారు చేశారు.

చూడటానికి అచ్చం మారుతి స్విఫ్ట్ తరహాలో కనిపించే మినీ క్లబ్‌మ్యాన్ ధర 45 లక్షలు ఎందుకో తెలుసా..? ఇంత రేటెందుకో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి..

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

మినీ ఇండియా కథనం మేరకు, మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్ కారు మీద ఫిబ్రవరి 15, 2020 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఈ మోడల్ కేవలం ఆమెజాన్ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ స్పెషల్ అండ్ లిమిటెడ్ ఎడిషన్ మినీ క్లబ్‌మ్యాన్ కారును కేవలం 15 మందికి మాత్రమే విక్రయిస్తున్నట్లు మినీ తెలిపింది.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

మినీ క్లబ్‌మ్యాన్ న్యూ ఎడిషన్ ఇండియన్ సమ్మర్ రెడ్ మోడల్‌ ఎక్ట్సీరియర్‌లో రెడ్ కలర్ పెయింట్ స్కీమ్, పలు రకాల పియానో బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ వచ్చాయి. ప్రత్యేకించి సైడ్ మిర్రర్లు, రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లు వచ్చాయి.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

మినీ క్లబ్‌‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లోకి వస్తే, 6.5-ఇంచుల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దీని చుట్టూ గుండ్రటి ఆకారంలో ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్ వచ్చింది.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

పానరొమిక్ గ్లాస్ రూఫ్, సరికొత్త బ్లాక్ చెక్స్ గల ఇంటీరియర్ డిజైన్, ఆంబియంట్ లైటింగ్, ప్రొజెక్షన్ ల్యాంప్స్, మెమొరీ ఫంక్షన్ గల ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, కార్బన్ బ్లాక్ ఫినిషింగ్ గల అప్‌‌హోల్‌స్ట్రే ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

సేఫ్టీ పరంగా మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కారులో బ్రేక్ అసిస్ట్, త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ కార్నరింగ్ కంట్రోల్, బిఎమ్‌డబ్ల్యూ నుండి సేకరించిన రన్-ఫ్లాట్ టైర్లు మరియు ఇండికేటర్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ కెమెరా మరియు వివిధ రకాల ఎయిర్ బ్యాగులు వచ్చాయి.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

సరికొత్త మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్‌లో 2.0-లీటర్ కెపాసిటీ గల శక్తివంతమైన ట్విన్-టుర్భో పెట్రోల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 228కిలోమీటర్లు మరియు 7.2-సెకన్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

మినీ క్లబ్‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ ఎడిషన్ లాంచ్: ధర రూ. 44.90 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మినీ క్లబ్‌‌మ్యాన్ ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్ అత్యంత అరుదైన మోడల్ అని చెప్పుకోవాలి. మినీ ఇండియా కేవలం 15 యూనిట్లను మాత్రమే ఇండియన్ మార్కెట్ కోసం కేటాయించింది. అరుదైన కార్లను ఎంచుకునే కస్టమర్లకు ఇదొక గొప్ప అవకాశం.

Most Read Articles

English summary
New Mini Clubman Indian Summer Red Edition Launched In India: Prices Start At Rs 44.90 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X