2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. మునుపటి తరం మహీంద్రా థార్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మహీంద్రా థార్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

తాజాగా ఈ సరికొత్త ఆఫ్-రోడర్ ఎస్‌యూవీకి సంబంధించిన ఇంటీరియర్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని దేశంలో అనేకసార్లు పరీక్షిస్తుండగా కెమెరాకు చిక్కింది. ఈ నేపథ్యంలో తాజా లభించిన స్పై చిత్రాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిలో కొత్త 2020 థార్ ఇంటీరియర్ వివరాలు లీక్ అయ్యాయి.

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు కార్బన్-ఫైబర్‌తో తయారు చేసిన గుండ్రటి ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, దాని చుట్టూ ఫినిషింగ్ వంటి వివరాలను ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త థార్‌లో జోడించిన ఇతర ఫీచర్లలో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లో ఉంచిన ఫోల్డబిల్ కీ ఫాబ్ మరియు పవర్-విండో స్విచ్‌లు, డిజిటల్ డిస్‌ప్లేతో రెండు అనలాగ్ డయల్‌లతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్ క్యాబిన్ అంతటా సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

నెక్స్ట్-జెనరేషన్ మహీంద్రా థార్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్ లైనప్‌లో టియువి300 ప్లస్ మరియు స్కార్పియో మోడళ్లను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త థార్ ఎస్‌యూవీ కూడా ప్రస్తుత-తరం మోడల్‌తో పోలిస్తే పెద్ద ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉంటుంది తెలుస్తోంది.

MOST READ:కెటిఎమ్ డ్యూక్ 390 ఇంజిన్ కేస్ బ్రోకెన్, ఎలాగో తెలుసా ?

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

దీని కారణంగా కొత్త థార్‌లో విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ ఉండే అవకాశం ఉంది. మునుపటి-తరం మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లోని ఇంటీరియర్స్ మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందిస్తుందని సమాచారం.

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త 2020 థార్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద వెర్టికల్-స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన కొత్త బంపర్‌లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఇది ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌తో లభ్యం కానుంది. మెరుగైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ఇందులో ఆల్-టెర్రైన్ టైర్లతో కొత్త ఫైవ్-స్పోక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

MOST READ:అమ్మకానికి ఉన్న విరాట్ కోహ్లీ కార్ ; దీని రేటెంతో తెలుసా !

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

ఈ కొత్త మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందులోని 2.2-లీటర్, బిఎస్6 కంప్లైంట్ టర్బో డీజిల్ ఇంజన్ సుమారుగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది.

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

ఇకపోతే ఇందులోని కొత్త 2.0-లీటర్ ‘టిజిడి ఎమ్‌స్టాలియన్' టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు తక్కువ-నిష్పత్తి గల గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటాయి. ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

MOST READ:కియా సోనెట్ వరల్డ్ ప్రీమియర్ లాంచ్ ; ఇతర వివరాలు

2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త 2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2020 మహీంద్రా థార్ క్యాబిన్ మెరుగైన స్థలాన్ని మరియు మంచి లుక్ అండ్ ఫీల్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త తరం థార్ ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను ఆకర్షించడమే కాకుండా, ఆన్-రోడ్ కోసం ఓ సమకాలీన ఎస్‌యూవీని వెతుకుతున్న కొనుగోలుదారులను కూడా ఆకర్షిస్తుందని మహీంద్రా పేర్కొంది. ఇది కేవలం ఆఫ్-రోడ్ ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, రెగ్యులర్‌గా ఉపయోగించుకునేలా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
The most-anticipated 2020 Mahindra Thar will be unveiled on August 15, 2020, in the Indian market. The company has chosen the Indian Independence day to mark this special occasion. The next-gen Thar will feature many upgrades over its previous-gen model inside and out. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X