భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో తమ సరికొత్త ఐదవ తరం ఆడి ఏ4 సెడాన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొత్త తరం ఆడి ఏ4 కోసం కంపెనీ అధికారిక బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ఔత్సాహిక కస్టమర్లు ఆన్‌లైన్‌లో కానీ లేదా ఆడి అధికారిక డీలర్‌షిప్‌ల నుండి కానీ రూ.2 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఈ కొత్త 2021 ఆడి ఏ4 సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మోడల్ మార్కెట్లో విడుదల కానుంది. విడుదలైన తక్షణమే దీని డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ చేసేందుకు ఆడి ఇండియా, ఈ కొత్త సెడాన్‌ను భారత మార్కెట్లోనే ఉత్పత్తి చేస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఆడి ఇండియా ప్లాంట్‌లో ఇప్పటికే కొతత్ ఏ4 సెడాన్ ఉత్పత్తి ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నంద, తక్కువ ధరకే ఇది లభ్యం కావచ్చని తెలుస్తోంది.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

కొత్త తరం 2021 ఆడి ఏ4 సెడాన్ ఇప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో రానుంది. ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ను ఇందులో మనం గమనించవచ్చు. ఇంకా ఇందులో సరికొత్త ఫీచర్లతో పాటుగా అధునాతన కనెక్టింగ్ టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

కొత్త తరం ఆడి ఏ4 సెడాన్‌ను కంపెనీ ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 2.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇది 48వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ఈ కొత్త తరం ఆడి ఏ4 కారులో చేసిన డిజైన్ మార్పుల విషయానికి వస్తే, ఇందులోని ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లను కూడా కంపెనీ రీడిజైన్ చేసింది. ఆడి తన మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను ఇందులో ఆప్షనల్‌గా ఆఫర్ చేయనుంది. ఇందులోని హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు మరింత విశాలంగా ఉంటుంది.

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ఇతర మార్పులను గమనిస్తే, ఇందులో రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రిర్ బంపర్స్, 18-ఇంచ్ ప్రీమియం అల్లాయ్ వీల్స్, ట్వీక్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్‌ మొదలైనవి ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో కూడా కీలకమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

కొత్త తరం ఆడి ఏ4 సెడాన్ ఇప్పుడు ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటుగా ఇతర ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం క్యాబిన్ రూపాన్ని మరింత ప్రీమియం పెంచడంలో సహకరిస్తాయి.

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

కొత్త 2021 ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఈ మరియు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం గురించి ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, కొత్త ఆడి ఏ4 కోసం బుకింగ్స్ ప్రారంభించడం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని, 2021లో ఇది తమకు మొదటి ఉత్పత్తిగా విడుదల కానుందని చెప్పారు. ఆడి ఏ-సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో ఏ4 ఒకటని, ఇందులో కొత్తగా వస్తున్న మోడల్ ఈ విభాగానికి అనేక కొత్త ఆవిష్కరణలను తెస్తుందని ఆయన చెప్పారు.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New Gen Audi A4 Bookings Started Officially; Production Commenced In India. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X