Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా థార్ బుకింగ్స్ అదుర్స్.. కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లు బుక్..
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అక్టోబర్ 2, 2020వ తేదీన విడుదల తమ సరికొత్త తరం 2020 థార్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త థార్ మార్కెట్లో విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 9,000 యూనిట్ల బుకింగ్‌ను నమోదు చేసిన సంగతి తెలిసినదే.

మహీంద్రా పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త తరం థార్ కోసం ఇప్పటి వరకూ వచ్చిన బుకింగ్‌లలో దాదాపు 57 శాతం మంది వినియోగదారులు మొదటిసారిగా ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న వారని తెలిపింది. అంతేకాకుండా, మొత్తం బుకింగ్‌లలో మ్యాన్యువల్ వేరియంట్ కంటే ఆటోమేటిక్ వేరియంట్‌కే అధిక సంఖ్యలో బుకింగ్‌లు వచ్చాయని పేర్కొంది.

మోడ్రన్ ఇంటీరియర్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లతో వచ్చిన కొత్త తరం 2020 మహీంద్రా థార్ మార్కెట్లో ఇదివరకెన్నడూ లేని విధంగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. కేవలం ఆఫ్-రోడ్ ప్రియులనే కాకుండా రెగ్యులర్ కమ్యూటింగ్ కస్టమర్లను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వాహనాన్ని డిజైన్ చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

దేశీయ మార్కెట్లో కొత్త తరం మహీంద్రా థార్‌ను రూ. 9.8 లక్షల నుంచి రూ. 13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైస్ బ్రాకెట్‌లో విక్రయిస్తున్నారు. ఇది ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఏఎక్స్ వేరియంట్ చాలా తక్కువ ఎలక్ట్రానిక్స్ అసిస్టెన్స్ ఫీచర్లతో హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులను ఉద్దేశించి డిజైన్ చేయబడినది. ఇకపోతే టాప్-ఎండ్ ఎల్ఎక్స్ వేరియంట్ మార్కెట్లో సాధారణ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో తయారు చేయబడినది.

ఈ కొత్త తరం ఎస్‌యూవీలో అప్‌డేట్ ఇంజన్లను ఉపయోగించారు. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.
MOST READ:టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా తమ కొత్త తరం థార్ కోసం ఇటీవలే యాక్ససరీ ప్యాకేజ్‌ను కూడా ప్రకటించింది. తమ అభిమాన థార్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు ఈ యాక్ససరీలు సహకరిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఇటీవలే విడుదలైన కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీలతో ఇది అటు ఆఫ్-రోడ్ ప్రియులను, ఇటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది ఈ విభాగంలో ఫోర్స్ గుర్ఖా మరియు మారుతి సుజుకి నుండి రాబోయే జిమ్నీ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.