Just In
- 13 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 17 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 17 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Finance
8 ఏళ్ల గరిష్టానికి హోల్‌సేల్ ద్రవ్యోల్భణం, మార్చిలో 7.39 శాతం
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా టెస్టులు: బయటకు వచ్చిన ఫొటోలు.. రిపోర్టు ఎలా వచ్చిందంటే!
- Sports
ఆ ఒక్క పనితో కేప్టెన్ సంజు శాంసన్‌ను తలదించుకునేలా చేసిన మోరిస్
- Lifestyle
Mercury Transit in Aries on 16 April:మేషంలోకి బుధుడి సంచారం వల్ల.. ఈ 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!
- News
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్య... పదునైన ఆయుధాలతో దాడి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే
ఇటీవల భారత మార్కెట్లో హ్యుందాయ్ తన కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. కొత్త ఐ 20 తన మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ లోని టాప్ 5 ఫీచర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

1) ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లాంప్స్ :
కొత్త ఐ 20 యొక్క ఫ్రంట్ ఫాసియా బ్లాక్ క్యాస్కేడింగ్ గ్రిల్‌లో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో చిన్న వృత్తాకార ఫాగ్ లైట్స్ కూడా LED ట్రీట్మెంట్ పొందుతాయి. హ్యుందాయ్ ఐ 20 యొక్క వెనుక చివరలో Z ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ ఎలిమెంట్‌ను కలిగి ఉన్న సొగసైన టైల్లైట్ యూనిట్ లభిస్తుంది.

2) డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్:
ఐ 20 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఇందులోని టాకోమీటర్ యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుంది. దీని మధ్యభాగంలో ఒక MID స్క్రీన్ ఉంది, ఇది వాహనదారునికి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
MOST READ:ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?

3) 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ :
సెంటర్ స్టేజ్ 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, నావిగేషన్ మరియు రియర్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది.

4) బోస్ సౌండ్ సిస్టమ్ :
ఐ 20 యొక్క టాప్-స్పెక్‌లో 7 స్పీకర్ బోస్ సిస్టమ్‌కి సబ్ వూఫర్ మరియు బూట్‌లోని యాంప్లిఫైయర్‌తో అనుసంధానించబడి ఉంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

5) బ్లూలింక్ కనెక్టివిటీ :
బ్లూలింక్ కార్ అసిస్ట్‌ను చేర్చడం వల్ల ఐ 20 దాని పోటీదారులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఇందులో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, వెహికల్ స్టేటస్ చెక్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, రోడ్ సైడ్ అసిస్ట్స్ వంటి 50 ఫీచర్లు ఇందులో ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ ఐ 20 మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, వీటిలో మాగ్నా, స్పోర్ట్జ్, అష్టా మరియు అష్టా (ఓ) ఉన్నాయి, వీటి ధర రూ. 6.79 - 11.17 లక్షలు, ఎక్స్-షోరూమ్. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో టాటా ఆల్ట్రోస్, మారుతి బాలెనో, హోండా జాజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]