ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

భారతదేశంలో అత్యంత ఖరీదైన వాహనాలలో ల్యాండ్ రోవర్ ఒకటి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త (2020) ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

ల్యాండ్ రోవర్ సరికొత్త డిఫెండర్‌ను భారత మార్కెట్లో రూ. 69.99 లక్షల (ఎక్స్‌షోరూమ్,ఇండియా) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారత మార్కెట్లో 90 (3-డోర్) మరియు 110 (5-డోర్) వేరియంట్లలో అందించబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మార్గం ద్వారా భారత మార్కెట్లోకి దిగుమతి అవుతుంది. ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో డిఫెండర్ కోసం బుకింగ్ ప్రారంభించినట్లు ధృవీకరించింది. అయితే డెలివరీలు మాత్రం 2020 ఆగస్టు నుండి ప్రారంభం కానున్నాయి.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక ఫీచర్స్ తో ప్రారంభించబడిందని, ఇది ఎలాంటి రోడ్లలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ల్యాండ్ రోవర్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సమర్థవంతమైన మరియు మన్నికైన ఉత్పత్తి ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్. ఇది వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మరియు 110 వేరియంట్లలో ఐదు ట్రిమ్-లెవల్లో అందించబడతాయి. ఇందులో బేస్, ఎస్, ఎస్ఇ, హెచ్ఎస్ఇ మరియు టాప్-స్పెక్ ఫస్ట్ ఎడిషన్ లు ఉన్నాయి. అన్ని వేరియంట్లు మంచి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

డిఫెండర్ యొక్క 90 మరియు 110 మోడళ్లు రెండూ కూడా సింగిల్ ఇంజన్ ఎంపికలతో అందించబడతాయి. ఇది 2.0 లీటర్ నాలుగు సిలిండర్ బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్ని కలిగి ఉంటుంది.ఇది 29-బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ అత్యంత రహదారి సామర్థ్యం గల యంత్రంగా ప్రసిద్ది చెందింది. కొత్త డిఫెండర్ ఇండిపెండెంట్ ఎయిర్ సస్పెన్షన్ మరియు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ మరియు అత్యంత అధునాతన టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్‌తో సహా అన్ని ఆఫ్-రోడింగ్ సాధనాలను కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో పాటు, ప్రీమియం మరియు లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఓటిఎ (ఓవర్-ది-ఎయిర్) కనెక్టివిటీ టెక్నాలజీ, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్ప్లే మరియు ఇతరుల హోస్ట్ ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ యొక్క కొత్త కార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన మరియు ఐకానిక్ ఆఫ్-రోడర్‌లలో ఒకటి. ఈ ఎస్‌యువి గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఎట్టకేలకు ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కి ఇండియన్ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ జీప్ రాంగ్లర్ ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
New (2020) Land Rover Defender Launched In India At Rs 69.99 Lakh: Bookings Now Open. Read in Telugu.
Story first published: Wednesday, February 26, 2020, 18:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X