మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, ఇటీవల తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ మాగ్నైట్'ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ డిసెంబర్ నెల మొత్తం నిస్సాన్ మాగ్నైట్ రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ మోడల్ ధర పెరనుంది. ప్రస్తుతం ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.59 లక్షలుగా ఉంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైస్ ట్యాగ్‌తో భారత మార్కెట్లోనే అత్యంత సరసమైన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. నిస్సాన్ ఇండియా ఈ ఎస్‌యూవీని ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) అనే ఐదు వేరియంట్లలో అందిస్తోంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ కోసం కంపెనీ ఇటీవలే ఓ టెక్ ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ తాజాగా ఈ మోడల్ కోసం సరికొత్త యాక్ససరీలు మరియు స్టైలింగ్ ప్యాక్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ కథనంలో అఫీషియల్ నిస్సాన్ మాగ్నైట్ యాక్ససరీస్ గురించి తెలుసుకుందాం రండి.

MOST READ:కేవలం 10 నిముషాల్లో పుల్ ఛార్జ్ చేసుకోగల సాలీడ్ స్టేట్ బ్యాటరీ ; పూర్తి వివరాలు

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ కోసం తప్పనిసరిగా అవసరమైన యాక్ససరీస్ ప్యాక్‌లో కంపెనీ మడ్ ఫ్లాప్స్, ఫ్లోర్ అండ్ లగేజ్ మ్యాట్స్‌ని అందిస్తోంది. ఈ ఎసెన్షియల్ యాక్సెసరీస్ ప్యాక్‌ను కంపెనీ రూ.2,249 ధరతో అందిస్తోంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

స్టైలింగ్ ప్యాక్ విషయానికి వస్తే, ఈ ప్యాక్‌లో ఫ్రంట్ క్రోమ్ గార్నిష్, టెయిల్‌గేట్ ఎంట్రీ గార్డ్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, టెయిల్ ల్యాంప్ మరియు టెయిల్‌గేట్ గార్డ్ ఉన్నాయి. ఈ ప్యాక్‌ను రూ.4,799 ధరతో అందిస్తున్నారు.

MOST READ:ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

అంతే కాకుండా, సంస్థ తమ ప్రీమియం ప్యాక్‌ను రూ.8,999 ధరతో అందిస్తుండగా, రూ.31,999 ధరతో అల్లాయ్ వీల్స్ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. మాగ్నైట్ స్టైలింగ్ అండ్ కంఫర్ట్ కోసం కంపెనీ అనేక ఇతర ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ యాక్ససరీలను కూడా అందిస్తోంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

మాగ్నైట్ కోసం నిస్సాన్ ఇండియా డ్యూయల్ పోర్ట్ మొబైల్ ఛార్జర్ మరియు కార్ ఫ్రెషనర్‌తో సహా ఇతర దేశీయ ఉపకరణాలను కూడా అందిస్తోమది. మార్కెట్లో వీటి ధరలు రూ.70 నుండి రూ.999 వరకు ఉన్నాయి.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని సరసమైన ధర మరియు విశిష్టమైన ఫీచర్ల కారణంగా, మార్కెట్లో అతి తక్కువ సమయంలోనే అనేక మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క బేస్ ఎక్స్‌ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ గరిష్టంగా 6 నెలలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇందులో న్యూచరల్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సూపర్ ప్లాన్.. అదేంటో తెలుసా ?

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులోని బేస్ వేరియంట్లోనే 16 ఇంచ్ వీల్, స్కిడ్ ప్లేట్, ఫంక్షన్ రూఫ్ రైల్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఆళ్ పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం సరికొత్త యాక్ససరీస్‌ను విడుదల చేసిన నిస్సాన్

ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు ఫాగ్ లాంప్స్ మొదలైనవి లభిస్తాయి. ఇంటీరియర్స్‌లో 8 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Nissan India Has Launched Range Of Accessories For Its Magnite Compact SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X