Just In
- 16 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 43 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దూసుకెళ్తున్న నిస్సాన్ మాగ్నైట్, 5 రోజుల్లోనే 5000కి పైగా బుకింగ్స్
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ఇటీవలే, భారత విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సమర్పణకు మాగ్నైట్‌కు కస్టమర్ల నుండి అశేష ఆదరణ లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 5,000కి పైగా బుకింగ్స్ మరియు 50,000కి ఎంక్వైరీలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

నిస్సాన్ డిసెంబర్ 2, 2020వ తేదీన మాగ్నైట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఇది ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ డిసెంబర్ నెల మొత్తం నిస్సాన్ మాగ్నైట్‌ను రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో అందిస్తున్నారు. ఆ తర్వాతి నుండి దీని ధర పెరగనుంది.

నిస్సాన్ మాగ్నైట్ కోసం వస్తున్న బుకింగ్స్‌లో 60 శాతం టాప్-ఎండ్ వేరియంట్లయిన ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి (ప్రీమియం)ల కోసమే వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇకపోతే, ఇందులో 30 శాతం బుకింగ్స్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడిన వేరియంట్లకు వస్తున్నట్లు కంపెనీ వివరించింది.
MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

సివిటి గేర్‌బాక్స్‌తో కూడిన నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ కోసం ఇప్పటి వరకూ అందుకున్న మొత్తం బుకింగ్‌లలో 40 శాతం తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చాయని నిస్సాన్ పేర్కొంది. నిస్సాన్ నుండి వచ్చిన కొత్త ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫాం చాలా సమగ్రమైనది. ఇందులో వర్చువల్ షోరూమ్‌లు, బిల్డ్ అండ్ ప్రైస్ కాన్ఫిగరేటర్, వర్చువల్ టెస్ట్ డ్రైవ్ వంటి ఇండస్ట్రీ ఫస్ట్ డిజిటల్ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
MOST READ:ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

గడచిన వారం భారత మార్కెట్లో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ రూ.4.99 లక్షల రూ.10 లక్షల ధరలో అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). నిస్సాన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తమ మాగ్నైట్‌ను అత్యంత పోటీతత్వ ధరతో విడుదల చేసింది. ఈ కారులో అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు పరికరాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ చాలా అందమైన డిజైన్‌తో ఆకర్షణీయమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. పెద్ద వీల్ ఆర్చెస్‌తో ఇది రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది.
MOST READ:నమ్మండి ఇది నిజంగా హీరో స్ప్లెండర్ బైక్, కావాలంటే వీడియో చూడండి

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్స్‌లో కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్‌ను ‘టెక్ ప్యాక్'తో కూడా అందిస్తున్నారు, ఇందులో అనేక అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలో దాని పోటీతత్వ ధర, స్టైలిష్ డిజైన్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ల కారణంగా కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంపాక్ట్ సైజులో ఉండే మాగ్నైట్ దాని డిజైన్ ఎలిమెంట్స్ కారణంగా తొలిచూపులోనే కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇది ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇస్తుంది.
MOST READ:వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!