Just In
Don't Miss
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిస్సాన్ మాగ్నైట్ కలర్ ఆప్షన్స్ చూశారా?
నిస్సాన్ ఇండియా ఇటీవలే తమ సరికొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసినదే. నిస్సాన్ మాగ్నైట్ అందరికన్నా ముందుగా భారత మార్కెట్లోనే విడుదల కానుంది. అంతేకాకుండా, ఈ ఉత్పత్తిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేస్తున్నారు.

నిస్సాన్ మాగ్నైట్‌కు సంబంధించి మరో అప్‌డేట్ వెల్లడైంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభించే కలర్ ఆప్షన్లను కంపెనీ తెలియజేసింది. మాగ్నైట్ మొత్తం ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో 5 మోనోటోన్ (సింగిల్ కలర్) మరియు 3 డ్యూయల్ టోన్ (డబుల్ కలర్) ఆప్షన్లు ఉన్నాయి.

ఐదు మోనోటోన్ ఆప్షన్లలో ఒనిక్స్ బ్లాక్, సాండ్‌స్టోన్ బ్రౌన్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ మరియు స్టార్మ్ వైట్ ఆప్షన్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఆప్షన్లలో వివిడ్ బ్లూ & స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్ & ఒనిక్స్ బ్లాక్, పెరల్ వైట్ & ఒనిక్స్ బ్లాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మూడు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో రెండు ఆప్షన్లు మాత్రం బ్లాక్ కలర్ రూఫ్‌ని కలిగి ఉంటాయి.
MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

మాగ్నైట్ కోసం కంపెనీ ప్రవేశపెట్టిన పెయింట్ స్కీమ్స్‌లో నిస్సాన్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన నిస్సాన్ కిక్స్‌లో లభిస్తున్న కలర్ ఆప్షన్ల మాదిరిగానే ఉంటాయి. అయితే, మాగ్నైట్ యొక్క విలక్షణమైన ఫ్రంట్ ఫాసియా కారణంగా ఈ కలర్ ఆప్షన్లు కిక్స్‌లో కనిపించే వాటి కన్నా వేరుగా ఉంటాయి.

నిస్సాన్ మాగ్నైట్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని పెద్ద ఫ్రంట్ గ్రిల్, మరియు ఆల్‌రౌండ్ బ్లాక్ బాడీ క్లాడింగ్ కారణంగా మజిక్యులర్ లుక్‌ని కలిగి ఉంటుంది. హెడ్‌లాంప్ డిజైన్, మందపాటి డి-పిల్లర్స్ మరియు రెండు చివర్లలో సిల్వర్-ఫినిష్డ్ స్కఫ్ ప్లేట్ల కారణంగా ఎస్‌యూవీ సాలిడ్‌గా కనిపిస్తుంది.
MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

కంపెనీ డిజైనర్ మాగ్నైట్ డిజైన్ గురించి మాట్లాడుతూ.. టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉండేలా ఈ కారును డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు ఫాగ్ లైట్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్స్‌లో నిస్సాన్ మాగ్నైట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో తయారు చేశారు. ఇందులో బ్లాక్-అవుట్ క్యాబిన్‌తో పాటు సీట్ అప్‌హోలెస్ట్రీ, మౌంట్ కంట్రోల్స్‌తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 7 ఇంచ్ డిజిటల్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

ఇందులోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ (హెచ్‌బిఎ), వెహికల్ డైనమిక్ కంట్రోల్ (విడిసి), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ( టిసిఎస్), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్‌ఎస్‌ఏ) మరియు డ్రైవర్, కోప్యాసింజర్ కోసం ఎస్‌ఆర్‌ఎస్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ విత్ ప్రీటెన్షన్ అండ్ లోడ్ లిమిటర్ సీట్‌బెల్ట్స్ మొదలైనవి ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ కారులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా సెగ్మెంట్-ఫస్ట్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఆఫర్ చేయనున్నట్లు నిస్సాన్ ఇండియా తెలిపింది. కాకపోతే, ఇంజన్ పవర్, టార్క్ గణాంకాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

నిస్సాన్ మాగ్నైట్ కలర్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
నిగ్సాన్ మాగ్నైట్‌ను కంపెనీ మొత్తం 8 రంగులలో (5 సింగిల్ టోన్, 3 డ్యూయెల్ టోన్) అందిస్తోంది. ఇందులోని ప్రత్యేకమైన డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు చూడటానికి మరింత స్పోర్టీగా కనిపిస్తాయి.