భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోందని డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, నిస్సాన్ ఇప్పుడు తమ బి-ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 'నిస్సాన్ మాగ్నైట్' అనే పేరుతో పిలువబడే ఈ సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల కానుంది.

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై నిస్సాన్ గత కొంతకాలంగా పని చేస్తోంది. వాస్తవానికి ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణ ఈ సంవత్సరం ప్రారంభంలో జరగాల్సి ఉంది. భారతదేశం వేదిక 2020 చివరి నాటికి ఇందులోని ప్రొడక్షన్ వెర్షన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా ఈ మోడల్ విడుదల మరింత జాప్యం అయ్యింది.

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఇన్నాళ్లకు నిస్సాన్ తమ మాగ్నైట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ పరదాలను తొలగించింది. ఈ మోడల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించడమే కాకుండా, రాబోయే ఎస్‌యూవీ కోసం ‘మాగ్నైట్' అనే పేరును కూడా కంపెనీ ధృవీకరించింది. నిస్సాన్ మాగ్నైట్ బోల్డ్ ఫ్రంట్ డిజైన్‌తో ఇప్పుడు మరింత అగ్రెసివ్ లుక్‌తో స్పోర్టీ డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీలో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లను కలిగి ఉంది. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ నుండి ప్రారంభమై ఫ్రంట్ బంపర్‌లో కలుస్తుంది. ఇది చూడటానికి ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా అనిపిస్తుంది.

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లచో మరింత స్పోర్టీ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్రొఫైల్‌లో ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి. అయితే, ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే కావడంతో, ప్రొడక్షన్ వెర్షన్‌లో ఎన్ని ఫీచర్లు ఉంటాయో అనేది తెలియాల్సి ఉంది.

MOST READ:చివరి కోరిక: నచ్చిన కారుతో సహా రాజకీయనాయకుని అంత్యక్రియలు

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఈ కారులో ఉపయోగించే ఇంజన్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 94 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

నిస్సాన్ నుంచి వస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రాండ్ యొక్క గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఉంటుందని నిస్సాన్ గతంలో పేర్కొంది. ఈ ఎస్‌యూవీని బ్రాండ్ యొక్క గ్లోబల్ హెరిటేజ్ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయనున్నారు. నిస్సాన్ పాట్రోల్, కష్కాయ్, కిక్స్, జ్యూక్ మరియు పాత్‌ఫైండర్ వంటి పెద్ద మరియు ప్రసిద్ధి చెందిన ఎస్‌యూవీల నుండి ప్రేరణ పొంది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

నిస్సాన్ మాగ్నైట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా, నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "నిస్సాన్ గ్లోబల్ ఎస్‌యూవీ డిఎన్ఏలో నిస్సాన్ మాగ్నైట్ ఒక అధునాతనమైన మోడల్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ కారు, దాని విభాగంలో గేమ్-ఛేంజర్ అవుతుంది. సబ్-4 మీటర్ కేటగిరీలో వస్తున్న నిస్సాన్ మాగ్నైట్ పరిశ్రమ కోసం బి-ఎస్‌యూవీ విభాగాన్ని పునర్నిర్వచించగలదని మాకు నమ్మకం ఉంది. నిస్సాన్ మాగ్నైట్ 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' తత్వశాస్త్రంపై తయారు చేయబడింది మరియు జపాన్‌లో రూపొందించబడింది. భారతీయ వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అబివృద్ధి చేయబడినది" అని అన్నారు.

MOST READ:దొంగలించిన వాహనాలను గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్

భారత్ కోసం నిస్సాన్ మాగ్నైట్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎట్టకేలకు నిస్సాన్ ఇండియా తమ సరికొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. భారత విపణిలో అత్యంత పోటీతో నిండిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రాబోయే కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Nissan has finally unveiled its much-awaited B-SUV Concept, the Magnite globally. The Nissan Magnite is the brand's latest sub-4-metre SUV concept which will make its way to the Indian market sometime in early-2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X