భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ భారత మార్కెటులో డిసెంబర్ 02 న లాంచ్ చేయబడింది. ఈ కోట ఎస్‌యూవీ ప్రారంభించినప్పటినుంచి ఎంతో మంది వాహనదారులను ఆకర్శించింది. ఇది ప్రారంభించబడిన అనతి కాలంలోనే దాదాపు 15000 పైగా బుకింగ్స్ స్వీవీకరించడం జరిగింది.

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

రోజురోజుకి నిస్సాన్ మ్యాగ్నైట్ కి మరింత ఎక్కువ ఆధారం పెరగడంతో దీనికోసం కంపెనీ 1.5 లక్షల ఎంక్వైరీలను కూడా అందుకుంది. దేశీయ మార్కెట్లో నిస్సాన్ యొక్క ఒక ముఖ్యమైన మోడల్ గా ఈ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ నిలిచింది. ఇప్పటికే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్న విషయం కూడా అందరికి తెలిసిందే.

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

ఎట్టకేలకు ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ డెలివరీ కూడా ప్రారంభమైంది, నిస్సాన్ మాగ్నైట్ డీలర్ ద్వారా వినియోగదారులకు అప్పగించడాన్ని చూడవచ్చు. ఈ ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్ కారణంగా డీలర్‌షిప్‌లు కూడా నిల్వను ప్రారంభించాయి, దీన్ని బట్టి చూస్తే ఇది కొత్త సంవత్సరానికి ముందు పెద్దమొత్తంలో పంపిణీ చేసే అవకాశం ఉంది.

MOST READ:భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఎ 4 సెడాన్, ఇదే

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర 2021 జనవరిలో పెరిగే అవకాశం ఉన్నందున కొత్త సంవత్సరానికి ముందు నిస్సాన్ మాగ్నైట్ డెలివరీ కోసం ఎక్కువ మంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. కావున 2020 డిసెంబర్ 31 లోపు బుకింగ్‌లు మరింత పెరిగే అవకాశం ఉంది. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు రూ. 4.99 నుంచి రూ. 9.97 లక్షలకు లభించింది.

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. అవి ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) వేరియంట్లు. కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే దాని బేస్ వేరియంట్లో 16 ఇంచెస్ వీల్స్, స్కిడ్ ప్లేట్, ఫంక్షన్ రూఫ్ రైల్, 3.5 ఇంచెస్ ఎల్‌సిడి క్లస్టర్, అన్ని పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఉన్నాయి.

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

అంతే కాకుండా ఇందులో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, ఫాగ్‌ల్యాంప్ మొదలైనవి ఇవ్వబడ్డాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఇందులో అందించబడతాయి.

MOST READ:అలెర్ట్.. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

మ్యాగ్నైట్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, 7 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ రికగ్నైసన్, పుష్ బటన్ స్టార్ట్, 6 స్పీకర్ ఆడియో, ఆటోమేటిక్ ఎసి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డింగ్ ఓఆర్‌విఎం, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ అత్యంత ప్రజాదరణ పొందటం వల్ల మెరుగైన అమ్మకాలు మరియు సర్వీస్ తో పాటు పాటు తన డీలర్‌షిప్‌ను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ ధర కొత్త సంవత్సరం నుండి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ 31 కి ముందు ఎన్ని బుకింగ్స్ వస్తాయో వేచి చూడాలి.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Nissan Magnite Deliveries Starts In India. Read in Telugu.
Story first published: Friday, December 25, 2020, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X