నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ "నిస్సాన్ మాగ్నైట్"ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. నిస్సాన్ ఇండియా నుండి వస్తున్న మొట్టమొదటి సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ నవంబర్ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్‌కు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి చేసింది. ఇందులో ఇంజన్ స్పెక్స్, డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్, ఫీచర్స్, వేరియంట్స్ మొదలైనవి ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి (ప్రీమియం) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో ప్రతి వేరియంట్ కూడా వివిధ రకాల ఫీచర్లను, పరికరాలను కలిగి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలోని కియా సోనెట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొదలైన ఇతర కాంపాక్ట్-ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

ఈ కథనంలో నిస్సాన్ మాగ్నైట్‌లో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు, వివరాలను తెలుసుకుందాం రండి..!

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ

నిస్సాన్ మాగ్నైట్ 'ఎక్స్‌ఈ' ఇందులో లభించే బేస్ వేరియంట్. ఇది 1.0-లీటర్ న్యూచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6250 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ వేరియంట్‌లో లభించే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు
 • హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు
 • 16-ఇంచ్ స్టీల్ వీల్స్
 • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
 • L-ఆకారపు క్రోమ్ టిప్స్ (ఎల్ఈడి డిఆర్ఎల్‌ల స్థానంలో)
 • ఫ్రంట్ ఫెండర్‌పై టర్న్-ఇండికేటర్స్
 • గ్రే యాక్సెంట్స్‌తో కూడిన బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు
 • ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 3.5 ఇంచ్ ఎమ్ఐడి స్క్రీన్
 • అంతర్గతంగా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్
 • మాన్యువల్ ఏసి
 • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • యాంటీ-రోల్ బార్
 • ప్రెటెన్షనర్‌తో కూడిన సీట్-బెల్ట్
 • ఇమ్మొబిలైజర్
 • రియర్ పార్కింగ్ సెన్సార్

MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఎల్

'ఎక్స్‌ఎల్' అనేది నిస్సాన్ మాగ్నైట్ యొక్క లోవర్ మిడ్-స్పెక్ వేరియంట్. ఇది మిడ్ వేరియంట్‌కు దిగువన ఉంటుంది. ఈ వేరియంట్ 1.0-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ మరియు మరింత శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. అయితే, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌ఎల్ వేరియంట్ ఎక్స్ఈ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది మరియు వాటికి అదనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది:

 • డ్యూయల్ టోన్ కవర్లతో 16 ఇంచ్ స్టీల్ వీల్స్
 • సైడ్ మిర్రర్లపై టర్న్-ఇండికేటర్
 • బాడీ కలర్ సైడ్ మిర్రర్స్
 • ఆక్స్, బ్లూటూత్ మరియు ఎమ్‌పి3 కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్
 • ఆటో ఏసి
 • పవర్ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్
 • పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్
 • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
 • రియర్ ఆర్మ్‌రెస్ట్ (టర్బో మాత్రమే)
 • క్రూయిజ్ కంట్రోల్ (టర్బో మాత్రమే)
 • డ్రైవర్-సైడ్ ఆటో అప్ అండ్ డౌన్ విండో స్విచ్
 • ఫాస్ట్ ఛార్జ్ యూఎస్‌బి పోర్ట్
 • ఐఎస్ఓ ఫిక్స్ (టర్బో మాత్రమే)
 • సెంట్రల్ డోర్ లాకింగ్
 • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
 • ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్
 • హిల్ స్టార్ట్ అసిస్ట్ (టర్బో మాత్రమే)
 • ట్రాక్షన్ కంట్రోల్ (టర్బో మాత్రమే)
 • బ్రేక్ అసిస్ట్ (టర్బో మాత్రమే)
 • రిమోట్ కీలెస్ ఎంట్రీ

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 రివ్యూ.. ఇది అభిమానుల అంచనాలను అందుకుంటుందా..?

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి

మాగ్నైట్ 'ఎక్స్‌ఎల్' వేరియంట్ మాదిరిగానే, మాగ్నైట్ ఎక్స్‌వి వేరియంట్ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఒకే రకమైన పవర్ మరియు టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తాయి. టర్బో-పెట్రోల్ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

ఈ మిడ్-వేరియంట్ నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి, ఎక్స్‌ఎల్ వేరియంట్‌లోని అన్ని ఫీచర్లతో పాటు, క్రింద పేర్కొన్న అదనపు ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది:

 • ఎల్ఈడి డిఆర్ఎల్‌లు
 • ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్
 • 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
 • క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్
 • ఫ్రంట్ అండ్ రియర్ సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్స్
 • డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్
 • 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే)
 • వైర్‌లెస్ ఛార్జర్
 • ఎయిర్ ప్యూరిఫైయర్
 • ఎల్ఈడి స్కఫ్ ప్లేట్స్
 • యాంబియెంట్ లైటింగ్
 • పడల్ దీపాలు
 • 6 స్పీకర్లతో జెబిఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
 • యాక్టివ్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా
 • వెహికల్ డైనమిక్ కంట్రోల్
 • ఐ-కీ

MOST READ:మెర్సిడెస్ బెంజ్ క్లాసిక్ కార్ ర్యాలీ ; పూర్తి వివరాలు

నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి (ప్రీమియం)

నిస్సాన్ మాగ్నైట్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్‌వి (ప్రీమియం). 'ఎక్స్‌వి (ప్రీమియం)' వేరియంట్ కూడా ఎక్స్‌వి మాదిరిగానే రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో టర్బో-పెట్రోల్ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

ఈ టాప్-ఎండ్ వేరియంట్ నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి ప్రీమియంలో, ఎక్స్‌వి వేరియంట్‌లోని అన్ని ఫీచర్లతో పాటు, క్రింద పేర్కొన్న అదనపు ఫీచర్లు లభిస్తాయి:

 • ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
 • ఎల్ఈడి టెయిల్ లైట్స్
 • ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
 • విండో లైన్‌పై క్రోమ్ స్ట్రిప్
 • 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
 • ఆల్-బ్లాక్ క్యాబిన్
 • 36-డిగ్రీ కెమెరా
 • లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
 • టైర్-ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్
 • నిస్సాన్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ కొంటే బాగుంటుంది? వేరియంట్ వారీ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్-వైజ్ ఫీచర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిస్సాన్ బ్రాండ్‌కు మాగ్నైట్ భారత మార్కెట్లో చాలా కీలకమైన మోడల్‌గా మారనుంది. ఇది ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో లభ్యం కానుంది. టాప్-ఎండ్ వేరియంట్ నిస్సాన్ మాగ్నైట్ 'ఎక్స్‌వి (ప్రీమియం)' కావల్సిన అన్ని ఫీచర్లతో లభిస్తుంది. ఈ వేరియంట్‌ను ఎంచుకున్నట్లయితే, దీనికి అదనంగా ఎలాంటి ఆఫ్టర్ మార్కెట్ ఫీచర్స్‌ను జోడించుకోవాల్సిన అవసరం ఉండదు.

Most Read Articles

English summary
Nissan India is all set to introduce their all-new Magnite offering in the market. Ahead of its launch, the company has revealed all the details of the SUV, in terms of engine specs, dimensions, colour options, rivals and many other details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X