నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం 'మాగ్నైట్' అనే ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇటీవలే నిస్సాన్ మాగ్నైట్‌ను కంపెనీ డిజిటల్ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా నిస్సాన్ ఈ మోడల్‌కు సంబంధించి పూర్తి వాక్‌రౌండ్ వీడియోను పోస్ట్ చేసింది.

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

నిస్సాన్ మాగ్నైట్ డిజైన్ మేనేజర్ తకుమి యోనియామా ఈ కొత్త కారులోని డిజైన్ ఫీచర్లను హైలైట్ చేస్తుండటాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. డిజైనర్ పేర్కొన్న వివరాల ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది.

ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌, సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఈ ఎస్‌యూవీకి విలక్షణమైన రూపాన్ని జోడిస్తాయి. ఇతర ఫీచర్లలో ఎస్‌యూవీ చుట్టూ బ్లాక్-అవుట్ బాడీ క్లాడింగ్, డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఇడి స్ప్లిట్-టెయిల్ లైట్స్, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, విండో లైన్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్స్ మరియు బ్లాక్-అవుట్ సైడ్ మిర్రర్స్ వంటి డిజైన్ ఫీచర్లను కూడా గమనించవచ్చు.

MOST READ: టొయోటా అర్బన్ క్రూయిజర్ ఇంటీరియర్స్ వెల్లడి; ఈ అద్భుతాన్ని మీరు చూసేయండి!

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్‌లో హారిజాంటల్‌గా అమర్చిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బియ్యపు గింజ ఆకారంలో ఉన్న ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ క్యాబిన్ యొక్క ఫంకీ అండ్ మోడ్రన్ డిజైన్‌ను హైలైట్ చేయటంలో తోడ్పడతాయి.

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

మోనో-ఫారమ్ ఆకారంలో ఉన్న స్పోర్టీ-లుకింగ్ ఫ్రంట్ సీట్స్ డ్రైవర్‌కు మరియు ప్యాసింజర్లకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా వెనుక సీట్లు కూడా మంచి కుషనింగ్‌ను కలిగి ఉండి కారు యొక్క ప్రీమియం లుక్‌ని మరింత పెంచడంలో సహకరిస్తాయని తెలిపింది.

MOST READ: బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

ప్రొడక్షన్ వెర్షన్ నిస్సాన్ మాగ్నైట్‌లో మౌంటెడ్ కంట్రోల్స్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేసే కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

ఇంజన్ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో 1.0-లీటర్, త్రీ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను ప్రస్తుతం నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ అందిస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఉపయోగిస్తున్నారు. ట్రైబర్‌లోని ఇంజిన్ 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ: వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

అయితే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్-ఎస్‌యూవీలో మరో హైలైట్ ఏంటంటే, ఇందులో ఉపయోగించబోయే శక్తివంతమైన 1.0-లీటర్, త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్. దీనినే ‘హెచ్‌ఆర్ 10' అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. నిస్సాన్ నుంచి తొలిసారిగా ఈ ఇంజన్ మాగ్నైట్ ద్వారా పరిచయం కానుంది.

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

ఈ టర్బో ఇంజన్‌తో రానున్న కొత్త మాగ్నైట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ సుమారు 95 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ టర్బో ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రావచ్చని అంచనా.

MOST READ: కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 క్రూయిజర్ విడుదల; ధర, ఫీచర్లు

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

మాగ్నైట్ డిజైన్ గురించి నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ డిజైన్ మేనేజర్ తకుమి యోనియామా మాట్లాడుతూ, "నిస్సాన్ మాగ్నైట్ కాన్సెప్ట్ నిస్సాన్ యొక్క ఆత్మను ప్రతి విధంగా ప్రతిబింబిస్తుంది. మా డిజైన్ విధానం కేవలం కాగితంపై గీతలు గీయడం మాత్రమే కాకుండా శిల్పం యొక్క కళపై కూడా ఆధారపడింది. మాగ్నైట్ పరిచయం ద్వారా మేము ఓ దృఢమైన మరియు డైనమిక్ అనుభూతిని చెక్కామని భావిస్తున్నామని. స్వచ్ఛమైన చైతన్యాన్ని వెలికితీసి, అనవసరమైన వాటిని తొలగిస్తూ జపనీస్ భావం మరియు బ్యూటీ యొక్క ప్రధాన భాగాన్ని మేము అనుసరిస్తూ మాగ్నైట్‌ను డిజైన్ చేశాము. మా సరికొత్త సృష్టిని ప్రవేశపెట్టినందుకు మేము గర్విస్తున్నాము మరియు భారతదేశంలోని మా కస్టమర్లు దీన్ని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నామని" అన్నారు.

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

ఇదే విషయంపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నిస్సాన్ మాగ్నైట్ కాన్సెప్ట్‌ను భారతీయ వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని జపాన్‌లో రూపొందించబడింది. దీని ముందు భాగం మరియు గ్రిల్ ఫ్రేమ్ దృఢత్వాన్ని పెంచడానికి ఇది వెర్టికల్ మోషన్‌ను కలిగి ఉంటుంది. సొగసైన మరియు పదునైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్-ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు మంచి ఇంప్రెషన్‌ను సృష్టిస్తాయి. ఈ డైనమిక్ కాంబినేషన్‌తో వస్తున్న మాగ్నైట్ మరింత నమ్మకంగా, ధైర్యంగా మరియు శక్తివంతంగా కనిపిస్తుందని" అన్నారు.

MOST READ: మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కొత్త రికార్డ్; ఒక్క ఏడాదిలో 25,000 కార్లు

నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

నిస్సాన్ మాగ్నైట్ వాక్అరౌండ్ వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

చంకీ వీల్స్ ఆర్చెస్ మరియు స్ట్రాంగ్ షోల్డర్ లైన్స్‌తో నిస్సాన్ మాగ్నైట్ ఖచ్చితంగా గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. కారు పైభాగంలోని రూఫ్ రెయిల్స్ మరియు అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు ఈ వైఖరిని మరింత పెంచుతాయి. నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
The Nissan Magnite concept was recently unveiled via a digital event to the world. The company has posted a complete walkaround video of the upcoming SUV. Design Manager, Takumi Yoneyama takes us through the design highlights of the new car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X