కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ వోల్వో అందిస్తున్న కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. అలాంటిది వోల్వో ఇప్పుడు తమ కొత్త కార్లను భారీ క్రేన్ల సాయంతో ఎత్తు నుండి క్రిందకు పడేసి నుజ్జు నుజ్జు చేసింది. ఇందుకు ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది.

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

అదేంటంటే.. తక్కువ సమయంలో ప్రమాదానికి గురైన కార్ల నుండి ప్రయాణీకులను సురక్షితంగా బయటకు చేర్చేలా ఫస్ట్ రెస్పాండర్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు కంపెనీ అలా చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు వోల్వో కార్స్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడిలో కంపెనీ ఓ భారీ క్రేన్ ఉపయోగించి గణనీయమైన ఎత్తు నుండి అనేక రకాల కొత్త వోల్వో కార్లను క్రాష్ చేసింది.

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

ఇలా చేయటం ద్వారా నష్టాన్ని అంచనా వేయడం, ప్రయాణీకులను రక్షించడంలో ఫస్ట్ రెస్పాండర్స్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో వారికి సహాయపడటానికి కంపెనీ క్రాష్ టెస్ట్స్ చేసింది. కొత్త కార్లను దాదాపు 30 మీటర్ల ఎత్తు నుండి వివిధ రకాల భుభాగాలపై విసిరివేసి, ప్రమాద తీవ్రతలను అంచనా వేసింది.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

వోల్వో ఈ క్రాష్ టెస్టులలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఫస్ట్ రెస్పాండర్స్ పరిస్థితిని అంచనా వేయడంలో సహాయపడటానికి వాటిలో ఎక్కువ భాగం పునఃసృష్టి చేసింది. పరిశ్రమలో ‘జాస్ ఆఫ్ లైఫ్' అని పిలువబడే హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి ప్రమాదానికి గురైన వారిని త్వరితగతిన సురక్షితంగా వెలికితీసేలా శిక్షణ ఇచ్చింది.

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

ఈ పరిశోధనపై వోల్వో కార్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రీసెర్చ్ టీమ్‌ సీనియర్ పరిశోధకుడైన హకాన్ గుస్టాఫ్సన్ మాట్లాడుతూ.. "మేము చాలా సంవత్సరాలుగా స్వీడిష్ రెస్క్యూ సర్వీసులతో కలిసి పనిచేస్తున్నాము. దీనికి కారణం మాకు ఒకే లక్ష్యం: అందరికీ సురక్షితమైన రోడ్లు ఉండడం. అత్యంత తీవ్రమైన ప్రమాదాలను ఎవ్వరూ అనుభవించాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నాము, కాని మనం అన్ని ప్రమాదాలను నివారించలేము. కాబట్టి అత్యంత తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను రక్షించడంలో సహాయపడే పద్ధతులు ఉండాలి."

MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

"మామూలుగా మేము ప్రయోగశాలలో కార్లను మాత్రమే క్రాష్ చేస్తాము, కాని మేము వాటిని క్రేన్ నుండి పడేయడం ఇదే మొదటిసారి. పరీక్ష తర్వాత తీవ్రమైన వైకల్యాలు కనిపిస్తాయని మాకు తెలుసు. కానీ, రెస్క్యూ టీంకు నిజమైన సవాలు ఇవ్వడానికే మేము ఇలా చేసామని" ఆయన అన్నారు.

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

పరిమాణం మరియు ఆకారాన్ని బట్టి వోల్వో కంపెనీ వివిధ విభాగాలకు చెందిన మొత్తం పది మోడళ్లను ఇలా క్రాష్ చేసింది. క్రాష్ చేసిన కార్లన్నీ పూర్తిగా సరికొత్తవి మరియు ఫ్యాక్టరీ నుండి నేరుగా క్రాష్ టెస్ట్ కోసం వినియోగించబడినవి. ఇందులో కొన్ని మోడళ్లను క్రేన్ నుండి పదేపదే క్రింద వేసి, క్రాష్ తీవ్రతను కూడా పెంచారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 రివ్యూ.. ఇది అభిమానుల అంచనాలను అందుకుంటుందా..?

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

వోల్వో కార్స్ సేఫ్టీ ఇంజనీర్లు ప్రతి కారుకు కావలసిన స్థాయిలో నష్టాన్ని చేరుకోవటానికి ఎంత ఒత్తిడి మరియు బలం అవసరమోనని ఖచ్చితమైన లెక్కలు వేశారు. ఆధునిక కార్లు మరియు పదిహేను నుండి ఇరవై సంవత్సరాల క్రితం తయారైన కార్ల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కంపెనీ తెలిపింది.

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

ఈ నేపథ్యంలో, కొత్త కార్ల నిర్మాణానికి సంబంధించిన అనుభవాన్ని ఫస్ట్ రెస్పాండర్స్‌కు పరిచయం చేయటానికి వోల్వో ఈ తరహా క్రాష్ టెస్టులను నిర్వహించింది. పరిశ్రమలో ప్రమాద అధ్యయనం కోసం ఈ తరహా క్రాష్ టెస్టులను నిర్వహించడం ఇదే మొదటిసారి.

వోల్వో కంపెనీ ఈ క్రాష్‌ల నుండి వచ్చిన అన్ని ఫలితాలను రికార్డ్ చేసి, వాటి అధ్యయనాలను భావితరాలు వెల్లడి చేస్తుంది. ఈ ఫలితాలతో విస్తృతమైన పరిశోధనా నివేదికను తయారు చేసి, శిక్షణ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫస్ట్ రెస్పాండర్స్ కోసం అందుబాటులో ఉంచనుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ క్లాసిక్ కార్ ర్యాలీ ; పూర్తి వివరాలు

కొత్త కార్లను చిత్తు చేసిన వోల్వో, కారణమేంటో తెలుసా?

వోల్వో కార్లను క్రాష్ చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే వోల్వో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేస్తుంది. ప్రయాణీకుల సేఫ్టీ విషయంలో మెరుగుపరచాల్సిన అంశాలను అధ్యయనం చేయటం మరియు ప్రమాద సమయాల్లో ఫస్ట్ రెస్పాండర్స్‌కు శిక్షణ ఇవ్వటం కోసం వోల్వో చేసిన ఈ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo Cars released a video where it recently crashed several new cars from a substantial height using a crane. The crash exercise has been done by the company to help first responders assess the damage and improve their skills in recovering occupants. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X