మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్'ని తయారు చేస్తోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా రెనాల్ట్ కిగర్ మరోసారి టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కింది. రెనాల్ట్ కిగర్‌ను హెచ్‌బిసి అనే కోడ్ నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు, ఇది కంపెనీ నుండి వస్తున్న మరో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కాంపాక్ట్ ఎస్‌యూవీ.

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

వాస్తవిక షెడ్యూల్ ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ఆరంభంలోనే తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, ప్రస్తుతం దేశీయ కార్ మార్కెట్ పుంజుకున్న నేపథ్యంలో, ఈ ఏడాది పండుగ సీజన్ నాటికే రెనాల్ట్ ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

తాజాగా మోటారు ఆక్టేన్ రెనో కిగర్ టెస్టింగ్ ఫొటోలను తమ కెమెరాలో బంధించింది. ఈ చిత్రాలను చూసినట్లుగా, రెనాల్ట్ నుండి రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ ఓవరాల్ డిజైన్ సిల్హౌస్‌ను, ముఖ్యంగా సైడ్ ప్రొఫైల్‌ను వెల్లడి చేస్తుంది. ఈ టెస్టింగ్ వాహనాన్ని భారీగా క్యామోఫ్లేజ్ చేయటం వలన ఈ చిత్రాల నుండి చాలా వివరాలు బయటకి కనిపించడం లేదు. అయితే, ఇందులో రూఫ్ ట్రాక్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్ డిజైన్‌ను మనం ఇందులో గమనించవచ్చు. ఈ టెస్టింగ్ వాహనానికి అల్లాయ్ వీల్స్ కూడా అమర్చినట్లు కనిపిస్తుంది. బహుశా ఇది టాప్-ఎండ్ వేరియంట్ కావచ్చని తెలుస్తోంది.

MOST READ: ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

ప్రస్తుతం ఈ బ్రాండ్ లైనప్ నుంచి తయారవుతున్న రెనాల్ట్ ట్రైబర్‌లో ఉపయోగిస్తున్న CMF-A+ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మంచి క్యాబిన్ స్పేస్ ఉంటుందనిపిస్తోంది, ఫలితంగా ఇందులో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునేంత స్థలం ఉంటుంది. రెనాల్ట్ కిగర్ పెద్ద వీల్ ఆర్చెస్, బోల్డ్ క్రీజ్ లైన్లు మరియు ఫ్లోటింగ్-రూఫ్‌తో రగ్గడ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

ఈ కారు ఇంటీరియర్ లోపల కూడా అనేక ఫీచర్లు మరియు కనెక్టివిటీ సదుపాయాలు అలాగే కంఫర్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండొచ్చని అంచనా. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటుగా బ్రాండ్ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్ కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

ఇంజన్ విషయానికి వస్తే.. రెనాల్ట్ ఇందులో రెండు 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. లోయర్-స్పెక్ వేరియంట్లలో న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్‌ను రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి నుంచి గ్రహించనున్నారు. ఈ ఇంజన్ 71bhp పవర్‌ని మరియు 96Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కిగర్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను చేర్చడం. ప్రస్తుతం ‘హెచ్‌ఆర్10' (HR10) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా సుమారు 95 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ టర్బో-పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడే ఆస్కారం ఉంది.

మరోసారి కెమెరాకి చిక్కిన రెనాల్ట్ కిగర్; సమీపిస్తున్న ఇండియా లాంచ్!

రెనాల్ట్ కిగర్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త రెనాల్ట్ కిగర్ అధునాతన ఫీచర్లతో పాటుగా టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని మేము అంచనా వేస్తున్నాము. ప్రస్తుతం అత్యధికంగా పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనాల్ట్ కిగర్ బాగా స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రీజ్జా మొదలైన మోడళ్లకు గట్టిగా నిలుస్తుంది.

Source: MotorOctainMost Read Articles

English summary
The Renault Kiger has been spotted testing on several occasions on the India roads. The Kiger (codename HBC) will be a sub-4m SUV compact SUV from the company. The compact SUV was supposed to make its debut sometime early next year, but now it is likely to go on sale around this year's festive season. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more