రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్' కొత్త సంవత్సరంలో విడుదలకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ను అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన పేటెంట్ చిత్రాలను కంపెనీ విడుదల చేసింది.

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

రెనో విడుదల చేసిన కిగర్ పేటెంట్ చిత్రాల ప్రకారం, ప్రొడక్షన్ వెర్షన్‌లో ఏయే ఫీచర్లు లభిస్తాయో తెలుసుకోవచ్చు. ఈ చిత్రాలు కిగర్ డిజైన్ లాంగ్వేజ్‌ని స్పష్టంగా వెల్లడి చేస్తాయి. ఇది చూడటానికి, రెనో ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇతక మోడళ్ల డిజైన్ మాదిరిగానే కనిపిస్తుంది.

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ నుండి అత్యంత పాపులర్ అయిన సిఎమ్‌ఎఫ్-ఎ+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. దీని ఫ్రంట్ డిజైన్‌ను గమనించినట్లయితే, ముందు భాగంలో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంటుంది, ప్రతి హెడ్‌ల్యాంప్‌లో మూడు స్ప్లిట్ ఎల్ఈడి ల్యాంప్స్ కనిపిస్తాయి.

MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

హెడ్‌ల్యాంప్ సెటప్ పైభాగంలో సన్నటి ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ సెటప్ ఉంటుంది. డేటైమ్ రన్నింగ్ లైట్లను ఫ్రంట్ గ్రిల్ పైభాగంలో అమర్చారు, ఈ లైట్ల మధ్య పెద్ద రెనో లోగో ఉంటుంది. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంది. బంపర్ దిగువ భాగంలో మరో మెష్ గ్రిల్, బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది. ఈ క్లాడింగ్ కారు చుట్టూ కనిపిస్తుంది.

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

ఈ ఎస్‌యూవీ బోనెట్ మరియు సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, దానిపై మజిక్యులర్ క్రీజ్ లైన్స్ కనిపిస్తాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత రగ్గడ్ లుక్‌ని ఇస్తాయి. ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో ఫినిష్ చేసిన సైడ్ మిర్రర్స్ ఉన్నాయి, వాటిపై టర్న్ ఇండికేటర్స్‌ను కూడా అమర్చారు.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

కాగా, ఈ పేటెంట్ చిత్రాల్లో రూఫ్ లైన్స్, డోర్ హ్యాండిల్స్, బ్రేక్ ప్యాడ్స్ స్పాయిలర్ మరియు రియర్ బంపర్లపై నియాన్ గ్రీన్ కలర్ పెయింట్ స్కీమ్ కనిపిస్తుంది. మరి ఇది ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉంటుందో లేదో వేచి చూడాలి. మరోవైపు ఇందులో సన్‌రూఫ్ కూడా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, ఇది దేశంలో అత్యంత చౌకైన సన్‌రూఫ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా మారుతుంది.

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

కాగా, ప్రస్తుతానికి రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, కంపెనీ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాత ఫీచర్లతో దీనిని రూపొందించే అవకాశం ఉంది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

ఇక ఇంజన్ విషయానికి వస్తే, రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొత్త 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో విడుదలచేయనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 97 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల కానుంది.

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి, 19 ఇంచ్ వరకూ అల్లాయ్ వీల్స్‌ను సపోర్ట్ చేయగలదు. ఈ పేటెంట్ చిత్రాల్లో చూపిన అల్లాయ్ వీల్స్ చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. బహుశా ఇవి ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉండకపోవచ్చు.

MOST READ:మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; వివరాలు

రెనో కిగర్ పేటెంట్ చిత్రాలు విడుదల: డిజైన్ ఇతర వివరాలు వెల్లడి

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

Most Read Articles

English summary
Renault Kiger Patent Images Reveals Its Design Language. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X