2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

ఫ్రెంచ్ వాహన తయారీదారు అయిన రెనాల్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఈ రెనాల్ట్ క్విడ్ యొక్క ఫీచర్స్, ఇంజిన్ కెపాసిటీ వంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ వెహికల్ 2020 ఆటో ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది. ఇప్పుడు రెనాల్ట్ ఇండియా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకువచ్చింది. కొత్తగా వస్తున్నఈ రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న కె-జెడ్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించిన కొత్త రెనాల్ట్ క్విడ్ భారతీయ మార్కెట్లో ఇటీవల ప్రవేశపెట్టిన రెండవ తరం క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే కొత్త ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

కొత్త రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు 26.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై పవర్‌ట్రైన్ 44 బిహెచ్‌పి మరియు 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు ఒకే చార్జిపై దాదాపు 271 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

రెనాల్ట్ కె- జెడ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రెండు ఛార్జింగ్ ఎంపికలను కలిగి ఉంటుంది. అవి స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలు. స్టాండర్డ్ ఎసి ఛార్జర్‌ను ఉపయోగించి పుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిముషాలలో 30 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో 14 అంగుళాల స్టీల్ వీల్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్స్, రియర్ రెయిన్ వైపర్స్, టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఈజీ లింక్ ఇంటెలిజెంట్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటివి ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

రెనాల్ట్ క్విడ్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, ఎయిర్‌బ్యాగ్స్, సీట్-బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి పూర్తి అందుబాటులో లేదు. కానీ ఆటో ఎక్స్‌పో 2020 లో ఇది ఆవిష్కరించిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి రెనాల్ట్ ఇండియా ఎలక్ట్రిక్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకువచ్చింది. రెనాల్ట్ క్విడ్ ఒకసారి మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మారుతి వాగన్ ఆర్ ఎలక్ట్రిక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Renault Kwid Electric (K-ZE) Unveiled - Rivals The Upcoming Maruti WagonR Electric. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X