ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

ఫ్రెంచ్ వాహన తయారీదారు రెనాల్ట్ తన బ్రాండ్ అయిన ట్రైబర్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఇప్పుడు కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ ఇండియా (ఎఎమ్‌టి) ఆటోమాటివ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అమర్చిన ట్రైబర్ ని ఆవిష్కరించింది. రెనాల్ట్ ట్రైబర్ ఎఎమ్‌టి ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశంలో విడుదల కానుంది.

ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

రెనాల్ట్ ట్రైబర్ సాధారణంగా ఇండియాలో గత ఏడాది చివర్లో ప్రారంభించబడింది. రెనాల్ట్ ట్రైబర్ సబ్- 4 మీటర్ల ఎమ్‌పివి ప్రారంభించినప్పటి నుండి ఈ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనంగా మారింది. అమ్మకాలపరంగా చూస్తే టయోటా టయోటా ఇన్నోవా క్రిస్టా కంటే ఎక్కువగా ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

లాంచ్ సమయంలో రెనాల్ట్ కేవలం 5- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు దానికి ఎఎమ్‌టి అమర్చడం జరిగింది. రెనాల్ట్ ట్రైబర్‌లోని ఎఎమ్‌టి గేర్‌బాక్స్ అదే బిఎస్-6 కంప్లైంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ రెండవ తరం క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌కు కూడా శక్తినిస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌ అదనంగా కాకుండా రెనాల్ట్ ట్రైబర్ ఎంపివి లో భాగంగా ఉంటుంది. ఇది నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన బడ్జెట్ ఎంపివి గా నిలిచింది.

ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

రెనాల్ట్ ట్రైబర్ లోని ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, మౌంటెడ్ కంట్రోల్స్‌తో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎబిడితో ఎబిఎస్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు తొలగించడానికి వీలుగా ఉండే మూడవ వరుస సీటింగ్ వ్యవస్థ కూడ ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020: ట్రైబర్ ఎఎమ్‌టి ని ఆవిష్కరించిన రెనాల్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనాల్ట్ ట్రైబర్ మొట్టమొదటిసారిగా జూలై 2019 లో దాని గ్లోబల్ ప్రీమియర్‌లో ప్రదర్శించబడింది. రెనాల్ట్ ట్రైబర్ ఆటోమాటిక్ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, డాట్సన్ జిఒ ప్లస్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Renault Triber AMT Unveiled - Expected Launch Date, Prices, Specs & Images. Read in Telugu.
Story first published: Wednesday, February 5, 2020, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X