YouTube

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

లెజెండరీ బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్, తమ అధునాతన ఘోస్ట్ మోడల్‌ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఓ సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ అల్టిమేట్ లగ్జరీ కారును ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

ఈ మేరకు రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోర్స్టన్ ముల్లెర్-ఒట్వోస్ ఇటీవల తమ బ్రాండ్ కస్టమర్లు, ప్రజలు మరియు మీడియా కోసం బహిరంగ లేఖను రాశారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో, ఆయన ఈ లేఖను రాశారు.

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

గడచిన 2009లో ప్రారంభించిన ప్రస్తుత తరం ఘోస్ట్ మోడల్‌తో పోలిస్తే రాబోయే రోల్స్ రాయిస్ ఘోస్ట్ పూర్తిగా సరికొత్తగా ఉంటుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ నుండి తొలగిపోయే ప్రస్తుత రం ఘోస్ట్ మోడల్ నుండి కొత్త మోడల్‌తో పంచుకునే ఏకైక పరికరాలు స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ చిహ్నం మరియు ఇంటిగ్రేటెడ్ డోర్ గొడుగులు మాత్రమే.

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

రోల్స్ రాయిస్ ఈ లాక్‌డౌన్ సమయంలో తమ సరికొత్త తరం ఘోస్ట్ మోడల్ చివరి దశలను అభివృద్ధి చేస్తోంది. మారుతున్న తరంతో పాటుగా తమ వినియోగదారులకు మరింత విలాసవంతమైన అనుభూతిని అందించేందుకు రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఇంటీరియర్ డిజైన్‌పై దృష్టి పెట్టారు.

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

కొత్త తరం ఘోస్ట్, ఫాంటమ్ 8 మరియు కల్లినన్ మోడళ్లలో కనిపించే బ్రాండ్ యొక్క కొత్త అల్యూమినియం నిర్మాణాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

తరువాతి తరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్యలో ఎప్పుడైనా డిజిటల్ ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడుతుందని అంచనా. వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో ఇది భారతదేశంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:రోల్స్ రాయిస్ కార్లపై ఉన్న అతిపెద్ద అపోహలు ఇవే

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

కొత్త తరం ఘోస్ట్‌పై మరింత ఆసక్తిని పెంచేందుకు, ఆ మోడల్‌పై ఉన్న హైప్‌ను మరింత పెంచేందుకు రోల్స్ రాయిస్ రానున్న రోజుల్లో వరుస టీజర్ చిత్రాలు, వీడియోలను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

టోర్స్టన్ రాసిన ఓపెన్ లెటర్ ప్రకారం, "రాబోయే పదేళ్లపాటు మా ఘోస్ట్ క్లయింట్‌లలో ప్రతిధ్వనించేలా ఒక ఉత్పత్తిని సృష్టించడం అంటే వారి డిమాండ్లు మరియు కోరికలను మేము చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది, ఈ విషయంలో మేము అలానే చేసాము. ఈ సందర్భంగా వారు తమ ఘోస్ట్‌ యొక్క విశిష్టతలను, శైలిని ఆనందించారని మాకు చెప్పారు."

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

"ఇది వారు తమకు తాముగా నడపడాన్ని ఆనందించే కారు - లేదా సందర్భానుసారంగా ఉపయోగించేందుకు ఒక నైపుణ్యం కలిగిన డ్రైవర్‌ సాయంతో నడిపే కారు. సదరు యజమానులు కారు యొక్క వెనుక భాగంలోని డిజైన్ సరళతను కూడా మెచ్చుకున్నారు."

MOST READ:కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

"వారు అనవసరమైన అలంకారాలను, బయటకు కనిపించే కొన్ని విషయాలను తిరస్కరించడం ద్వారా డిజైన్ స్వచ్ఛతను కోరుకుంటున్నారని తెలిసింది. ఈ మినిమలిజాన్ని పూర్తి చేయడానికి, మా ఘోస్ట్ క్లయింట్‌లకు వారి కారులో వినూత్నమైన శైలితో, అధునాతన సాంకేతికతతో, అద్భుతమైన ఇంజనీరింగ్‌తో కొత్త ఘోస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నామ"ని ఆయన చెప్పారు.

ఈ ఏడాది సరికొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఆవిష్కరణ - వివరాలు

కొత్త తరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రోల్స్ రాయిస్ అభిమానులకు మరియు ఘోస్ట్ మోడల్ అభిమానులకు ఇది అద్భుతమైన వార్త. అందరిలానే మేము కూడా ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. వేచి ఉండండి, ఈ కొత్త ఘోస్ట్ గురించి మేము విన్న వెంటనే మరిన్ని విషయాలను మీ ముందుకు తీసుకువస్తాము.

MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

Most Read Articles

English summary
Legendary British auto manufacturer Rolls-Royce has announced that its upcoming Ghost model is under development and that its worldwide debut is expected as scheduled for later this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X