భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

స్పెయిన్‌కి చెందిన పురాతన కార్ బ్రాండ్ సియట్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే భారత రోడ్లపై తమ పాపులర్ 'సియట్ అరోనా'లో ఓ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతం అయితే, త్వరలోనే సియట్ అరోనా భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

సియట్ టెస్ట్ చేస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ అరోనా ఎస్‌యూవీ యూరోపియన్-స్పెక్ మోడల్ మాదిరిగా అనిపిస్తోంది. భారత మార్కెట్లో తమ బ్రాండ్ నుండి భవిష్యత్ మోడళ్ల కోసం ప్లాట్‌ఫామ్ సాధ్యాసాధ్యాలను పరీక్షించడానికి సియట్ అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ద్వారా అరోనా మోడల్‌ను ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

తాజాగా రష్‌లేన్ విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, సియట్ అరోనా ఎస్‌యూవీని కంపెనీ ముంబై-పూణే హైవేపై టెస్ట్ చేస్తోంది. ఈ టెస్టింగ్ వాహనంపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేదు, పైగా కారుకి ముందు మరియు వెనుక వైపు 'లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్' అనే బ్యాడ్జింగ్ చేయబడి ఉంది. సియట్ అరోనా టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కడం ఇదేం మొదటిసారి కాదు, ఇది వరకూ కూడా ఈ మోడల్ టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కింది.

MOST READ: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

సియట్ అరోనాను దేశంలోని వివిధ రోడ్లు, వాతావరణాలకు అనుగుణంగా టెస్ట్ చేస్తున్నాయి. అయితే, ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదల అవుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే అని చెప్పాలి. సియట్ బ్రాండ్ ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ అధీనంలో ఉంది.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

బహుశా ఫోక్స్‌వ్యాగన్ తమ భవిష్యత్ మోడళ్ల కోసం సియట్ ప్లాట్‌ఫామ్‌ను భారత రోడ్లపై పరీక్షిస్తుండవచ్చు లేదా ఫోక్స్‌వ్యాగన్ ద్వారానే ఈ కొత్త బ్రాండ్ ఇండియాలో విడుదల కావచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే, అసలు నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ: మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

తాజా నివేదికల ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ పోర్ట్‌ఫోలియోలో టైగన్ వంటి కొన్ని మోడళ్లకు మద్దతు ఇచ్చే కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరీక్షించడానికి కంపెనీ సియట్ అరోనా ఎస్‌యూవీని దేశంలోకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. సియట్ అరోనా కారును ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి అత్యంత పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ఏ0 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను భారత మార్కెట్ కోసం 'ఎమ్‌క్యూబి ఏ0 ఐఎన్'గా స్థానీకరించబడనుంది.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

ఈ ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను స్కొడా నుండి రాబోయే విజన్ ఇన్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తయారు చేయబడుతుంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు బ్రాండ్ల (స్కొడా, ఫోక్స్‌వ్యాగన్) నుండి రాబోయే మోడళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం డేటాను సేకరించడానికి అరోనాను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

ఇక సియట్ అరోనా విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న ఈ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టిఎస్‌ఐ త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

ఈ కారులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు టర్న్-ఇండికేటర్స్ మరియు పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంటుంది. ఇంకా బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, గ్రిల్ మధ్యలో మరియు బూట్-లిడ్‌లో ఉంచిన పెద్ద సియట్ లోగో వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. రూఫ్ రెయిల్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ: ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, అరోనాలో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

ఒకవేళ సియట్ అరోనా భారత మార్కెట్లో విడుదలైదే, ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వచ్చే అవకాశం ఉంది. ఈ విభాగంలో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్ మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

MOST READ: ఫారం 20 సవరణకు నాయకత్వం వహించనున్న కేంద్ర ప్రభుత్వం

భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

సియట్ అరోనా ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సియట్ అరోనా కేవలం టెస్టింగ్ ప్రయోజనం కోసం మాత్రమే భారతదేశానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కొడా బ్రాండ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్‌క్యూబి ఏ0 ఐఎన్ ప్లాట్‌ఫామ్ కోసం ఇంజనీర్లకు అవసరమైన డేటాను సేకరించడానికి ఇది సహాయపడుతుంది.

Source:Rushlane

Most Read Articles

English summary
SEAT Arona SUV has been spotted testing in India. The SUV seems like a European-spec model and is left-hand driven. The Arona could be brought in by Volkswagen to test the platform feasibility for future models from the brand in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X