స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా 'ఎన్యాక్ ఐవి' పేరుతో ఓ సరికొత్త ఎల్‌క్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి కొన్ని ఎక్స్‌టీరియర్ డిజైన్ స్కెచెస్‌ను కూడా విడుదల చేసింది.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

తాజాగా, ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్‌ను వెల్లడించే స్కెచ్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇప్పటికే యూరోపియన్ రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1, 2020 వే తేదీన ప్రేగ్‌లో స్కొడా ఎన్యాక్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

కొత్త స్కొడా ఎన్యాక్ ఐవి బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుందని, త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకోనుంది. స్కొడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని దాని అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనున్నారు.

MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

యాంత్రికంగా, స్కొడా ఎన్యాక్ ఐవి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 55 కిలోవాట్, 62 కిలోవాట్ లేదా 72 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బేస్ ‘55 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 146 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 340 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

మిడ్-స్పెక్ ‘62 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 177 బిహెచ్‌పి శక్తిని, 390 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇకపోతే, టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోటార్ 201 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోడల్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, వీటని రెండు యాక్సిల్స్‌లో అమర్చబడి ఉంటాయి. ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అయితే, బేస్ మరియు మిడ్-స్పెక్ వేరియంట్లలో మాత్రం ఎలక్ట్రిక్ మోటార్లను వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి, ఇవి రియర్-వీల్-డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తాయి.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

స్కొడా ఎన్యాక్ ఐవి ఎస్‌యూవీలను స్టాండర్డ్ 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. కాగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 125 కిలోవాట్ ఛార్జర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. దీని సాయంతో కేవలం ఒక గంట వ్యవధిలోనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 0 - 100 శాతం నుండి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

స్కొడా ఎన్యాక్ ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. పేరుకు తగినట్లుగానే ఇది పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 ఎలక్ట్రిక్ మోడల్‌లో ఉపయోగించిన అనేక విడిభాగాలను ఎన్యాక్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. స్కొడా తమ ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తుందని అంచనా.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda had released a new set of teasers of its upcoming Enyaq iV all-electric SUV. The German carmaker has announced that it will be presenting the all-electric SUV in Prague on September 1, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X