ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

స్కోడా ఆటో ఇటీవలే తమ కొత్త 2020 రాపిడ్ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ కారు కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారులో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌నే స్కొడా ర్యాపిడ్ కారులోనూ ఉపయోగించారు. ఇదివరకూ ఆఫర్ చేసిన 1.6 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ స్థానాన్ని ఈ కొత్త ఇంజన్‌తో భర్తీ చేశారు.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్కోడా రాపిడ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఇప్పటి వరకూ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఇకపై ఈ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ప్రవేశపెట్టాలని స్కొడా యోచిస్తోంది. టీమ్ బిహెచ్‌పి నివేదిక ప్రకారం, స్కోడా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాపిడ్ 1.0-లీటర్ టిఎస్‌ఐ ఏటి (ఆటోమేటిక్)ని విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

ఈ మోడల్‌లో టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. మార్కెట్లో 2020 స్కోడా రాపిడ్ 1.0-లీటర్ టిఎస్ఐ మాన్యువల్ సెడాన్ బేస్ ‘రైడర్' వేరియంట్ ప్రారంభ ధర రూ .7.49 లక్షలుగా ఉంది. స్కొడా ర్యాపిడ్ సెడాన్ మొత్తం ఐదు వేరియంట్లలో అందించబడుతుంది: రైడర్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో. టాప్-స్పెక్ స్కోడా రాపిడ్ మోంట్ కార్లో ధర 11.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా)గా ఉంది.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

ఈ సెడాన్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, డార్క్ గ్రీన్ టింటెడ్ విండోస్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్, విండో లైన్‌పై క్రోమ్ గార్నిష్ వంటి మార్పులు ఉన్నాయి.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

ఈ కారు లోపలివైపు గమనిస్తే, కొత్త స్కోడా రాపిడ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్కఫ్ ప్లేట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్రూయిజ్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: 2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త 2020 స్కొడా రాపిడ్ కారులో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 999 సిసి, త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

కొత్త రాపిడ్‌లోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఇబిడితో కూడిన ఏబిఎస్, రియర్‌వ్యూ కెమెరా మరియు సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్-వ్యూ మిర్రర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

స్కోడా రాపిడ్‌పై కంపెనీ నాలుగు సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు సంవత్సరాలు లేదా 1 లక్షల కిలోమీటర్ల వారంటీని కొనుగోలుదారులు పొందవచ్చు. బ్రేక్‌డౌన్ సమయంలో సహాయం చేయడానికి 24/7 అసిస్టెన్స్, నాలుగు సంవత్సరాల లేదా 60,000 కిలోమీటర్ల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా ఉంటాయి. ప్రతి 15,000 కిలోమీటర్లకు సర్వీస్ రిమైండర్‌ను సెట్ చేయబడుతుంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ - వివరాలు

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో రానున్న స్కొడా రాపిడ్‌తో రద్దీగా ఉండే నగర వీధుల్లో నడపడం చాలా సరదాగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ మోడల్ భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Team BHP

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto recently launched the 2020 Rapid in the Indian market. The car now comes with a petrol-only format and features the 1.0-litre TSI unit, borrowed from the Volkswagen Vento. The new 1.0-litre petrol engine replaces the older 1.6-litre MPI engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X