షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ సెడాన్ 'రాపిడ్'లో 'రైడర్' వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది. ఇప్పటి వరకూ బేస్ వేరియంట్‌గా అందుబాటులో ఉన్న స్కొడా ర్యాపిడ్ రైడర్ ఇకపై మార్కెట్ నుండి తొలగిపోనుంది. ఇదివరకు మార్కెట్లో ఈ బేస్ వేరియంట్ ధర రూ.7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది.

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్రత్యేకించి దాని సరసమైన ధర కారణంగా, భారత మార్కెట్లో బాగానే పాపులర్ అయిన బేస్ వేరియంట్‌గా కొనసాగింది. ఇది అన్ని బేసిక్ ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటుంది. రాపిడ్ ‘రైడర్' వేరియంట్ పాపులర్ కావటంతో కంపెనీ దీని ఆధారంగా ‘రైడర్ ప్లస్' అనే కొత్త వేరియంట్‌ను మరిన్ని అదనపు ఫీచర్లతో విడుదల చేసింది.

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

రైడర్ వేరియంట్‌ను నిలిపివేయడంతో, ఇకపై రైడర్ ప్లస్ స్కోడా రాపిడ్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా కొనసాగుతుంది. మార్కెట్లో స్కోడా రాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ కూడా ఈ విభాగంలో ఇప్పటికీ అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతుంది.

MOST READ:భయంకరమైన ప్రమాదంలో మరణాన్ని తప్పించిన మారుతి వితారా బ్రెజా.. ఎలాగో తెలుసా ?

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

స్కోడా రాపిడ్ రైడర్ వేరియంట్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమయ్యేది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేది, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు.

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

కాగా, రైడర్ వేరియంట్‌కి కొద్దిగా అడ్వాన్స్డ్ వేరియంట్‌గా వచ్చిన రైడర్ ప్లస్ వేరియంట్ కూడా ఇదే రకమైన ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కాకపోతే, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ స్కోడా రాపిడ్ వేరియంట్ ఆటోమేటిక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.9.49 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంటుంది.

MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

స్కోడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ సాకెట్స్, 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు ఎబిఎస్ వంటి ఫీచర్లతో లభించేంది.

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

కాగా, రాపిడ్ ‘రైడర్' వేరియంట్‌ను నిలిపివేయడానికి గల కారణాన్ని స్కొడా ప్రస్తావించలేదు. స్కోడా రాపిడ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఐదవ తరం హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

షాకింగ్ న్యూస్: స్కొడా ర్యాపిడ్‌లో రైడర్ వేరియంట్ నిలిపివేత!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం స్కొడా ర్యాపిడ్ కారును కంపెనీ ఈ ఏడాది మే నెలలో మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇందులో రైడర్ ప్లస్ పేరిట కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. రైడర్ ప్లస్ వేరియంట్ రాకతో రైడర్ వేరియంట్ అమ్మకాలు దెబ్బతినడం వల్లనే కంపెనీ ఈ వేరియంట్‌ను మార్కెట్ నుండి తొలగించినట్లుగా తెలుస్తోంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Rapid Rider Variant Discontinued, Rider Plus Becomes New Entry-Level Variant, Price Starts At Rs 7.99 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X