స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ, ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ స్కొడా ఆటో అందిస్తున్న ర్యాపిడ్ సెడాన్‌లో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, తాజాగా ఈ మోడల్‌కు సంబంధించి కంపెనీ ఇప్పుడు అధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించింది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా రాపిడ్ ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారులో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌నే స్కొడా ర్యాపిడ్ కారులోనూ ఉపయోగించారు. ఇదివరకూ ఆఫర్ చేసిన 1.6 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ స్థానాన్ని ఈ కొత్త ఇంజన్‌తో భర్తీ చేశారు.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్కొడా రాపిడ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఇప్పటి వరకూ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఇకపై ఈ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానుంది. సెప్టెంబర్ నెలలో రాపిడ్ 1.0-లీటర్ టిఎస్‌ఐ ఏటి (ఆటోమేటిక్)ని డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

కొత్త 2020 స్కొడా రాపిడ్ కారులో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 999సిసి, త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని, 1750-4000 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా పేర్కొన్న సమాచారం ప్రకారం ఆటోమేటిక్ వెర్షన్ ర్యాపిడ్ టిఎస్ఐ మోడల్ లీటరుకు 16.24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. స్టాండర్డ్ మ్యాన్యువల్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు ఈ కొత్త ఆటోమేటిక్ వేరియంట్లలో కూడా లభ్యం కానున్నాయి.

MOST READ: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

ఈ సెడాన్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, డార్క్ గ్రీన్ టింటెడ్ విండోస్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్, విండో లైన్‌పై క్రోమ్ గార్నిష్ వంటి మార్పులు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

ఈ కారు లోపలివైపు గమనిస్తే, కొత్త స్కొడా రాపిడ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్కఫ్ ప్లేట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్రూయిజ్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కొత్త రికార్డ్; ఒక్క ఏడాదిలో 25,000 కార్లు

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

కొత్త రాపిడ్‌లోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఇబిడితో కూడిన ఏబిఎస్, రియర్‌వ్యూ కెమెరా మరియు సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్-వ్యూ మిర్రర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

ప్రస్తుతం మార్కెట్లో 2020 స్కొడా రాపిడ్ 1.0-లీటర్ టిఎస్ఐ మాన్యువల్ సెడాన్ బేస్ ‘రైడర్' వేరియంట్ ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది. స్కొడా ర్యాపిడ్ సెడాన్ మొత్తం ఐదు వేరియంట్లలో అందించబడుతుంది: రైడర్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో. టాప్-స్పెక్ స్కొడా రాపిడ్ మోంట్ కార్లో ధర రూ.11.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా)గా ఉంది.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

స్కొడా ఇటీవలే కొత్త 2020 ర్యాపిడ్ సెడాన్‌ను 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో విడుదల చేసింది. ఆ తర్వాత ఇందులో కంపెనీ ఇప్పుడు కొత్తగా ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto has officially started accepting bookings for the upcoming Rapid 1.0 TSI automatic variant in the Indian market. The Skoda Rapid 1.0 TSI with the automatic transmission unit is expected to go on sale in the coming weeks. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X