2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

ఇండియన్ మార్కెట్లో స్కోడా ఇప్పటికి చాలా వాహనాలను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి కొత్త స్కోడా విజన్ కారుని ప్రవేశపెట్టడానికి అన్ని సన్నాహాలు చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

స్కోడా విజన్ ప్రవేశపెట్టనున్న కారు 2021 లో లాంచ్ కానున్నట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా 2021 లో లాంచ్ కానున్న స్కోడా, వోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా లాంచ్ చేసిన తొలి స్కోడా కారు ఇది.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

స్కోడా విజన్ బాహ్య రూపకల్పన ఇప్పటికి సిద్ధంగా ఉంది. ఇందులో ప్రకాశవంతమైన గ్రిల్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు బ్యాడ్జ్‌లు కాన్సెప్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంది. స్కోడా విజన్ ఇన్ కొలతలను గమనించినట్లయితే ఇది 4,256 మిమీ పొడవు, 1,589 మిమీ ఎత్తు, 2,671 మీమీ వీల్ బేస్ ని కలిగి ఉంటుంది.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

ఇందులో డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో రెండు భాగాల ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మ్యాచింగ్ రియర్ డిఫ్యూజర్‌తో క్రోమ్ స్కఫ్-ప్లేట్లు, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్‌తో కూడిన ఎడ్జీ ఓఆర్‌విఎంలు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ప్లాస్టిక్ లోయర్ బాడీ క్లాడింగ్, విలోమ ఎల్ షేప్ ఎల్‌ఈడీ టైల్లైట్ మరియు సన్నని లైట్ స్ట్రిప్ వంటివి ఉంటాయి. ఇవే కాకుండా పనోరమిక్ సన్ రూప్ మరియు క్రోమ్ ఫినిషెడ్ రూప్ రైల్స్ కూడా ఉన్నాయి.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

కొత్త స్కొడాలో ఇంటీరియర్ డిజైన్ ప్రొడక్షన్ స్పెక్ నుండి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ డిజైన్ మరియు లేఅవుట్ వల్ల ముందుకు సాగినట్లు అనిపిస్తుంది. ఇది మల్టిపుల్ కలర్స్ లో లభించనుంది. ఇందులో 12 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

స్కోడా విజన్ ఇన్ 1.5 లీటర్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో పని చేస్తుంది. ఇది 150 హెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల పరిధిని కేవలం 8.7 సెకన్లలో చేరుకోగలదని కంపెనీ తెలిపింది.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

స్కోడా విజన్ ఇన్ కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది. దీనిలో ఉన్న ఫీచర్స్ మరియు క్వాలిటీ వల్ల అమ్మకాలు బాగా జరగవచ్చని కంపెనీ ఊహిస్తోంది.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

కొత్తగా రాబోతున్న స్కోడా విజన్ గురించి మొత్తం సమాచారం ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ దీని ఫీచర్స్ మరియు ఇంజిన్ సామర్థ్యము వంటివి కొంతవరకు తెలిశాయి. స్కోడా విజన్ ఇన్ యొక్క నిర్దిష్టమైన ధరలు కూడా ఇంకా తెలియరాలేదు.

2021 లో లాంచ్ కానున్న స్కోడా విజన్ ఇన్ కారు ఎలా ఉంటుందో తెలుసా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా విజన్ ఇన్ 2021 కల్లా మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని నిర్దిష్టమైన ధరలు తెలియనప్పటికీ ఆశాజనకమైన ధరలను కలిగి ఉంటుందని ఊహించవచ్చు. స్కోడా విజన్ ఇన్ లోని ఫీచర్స్ మరియు డిజైన్ వంటివి వినియోదారులను బాగా ఆకర్శించే విధంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Skoda Vision IN SUV concept debuts – India launch in 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X