Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెకండ్ హ్యాండ్ ఫెరారీ కార్లపై ప్రత్యేకమైన వారంటీ స్కీమ్ - వివరాలు
ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ, భారతదేశంలో సెకండ్ హ్యాండ్ (ప్రీ-ఓన్డ్) కార్ల కోసం ప్రత్యేక వారంటీ పథకాన్ని ప్రారభించినట్లు ప్రకటించింది. ఈ వారంటీ స్కీమ్‌ను సర్టిఫైట్ ప్రీ-ఓన్డ్ ఫెరారీ కార్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశామని, ఇది వినియోగదారులకు మరింత విలువను ఇస్తుందని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో విక్రయించే ఫెరారీ సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లను రెండు సంవత్సరాల వారంటీతో హామీతో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 2020 నుండి, అధికారిక ఫెరారీ డీలర్లు అందించే అన్ని ఫెరారీ అప్రూవ్డ్ సర్టిఫైడ్ వాడిన కార్లు మధ్యప్రాచ్యం మరియు భారతదేశంలో రెండు సంవత్సరాల వారంటీ కవరేజ్‌ను కలిగి ఉంటాయని కంపెనీ వివరించింది.

కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఫెరారీ వంటి ఆల్ట్రా లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయటం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి కస్టమర్ల కొనుగోలు భయాన్ని తొలగించేందుకు, అమ్మకం తర్వాత తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఫెరారీ ఈ కొత్త వారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
MOST READ:చైనా బైక్‌లను నిషేదించిన మిజోరాం గవర్నమెంట్, ఎందుకో తెలుసా ?

ఫెరారీ సర్టిఫై చేసే ప్రీ-ఓన్డ్ కార్లను 100 కంటే ఎక్కువ చెక్ పాయింట్లను కలిగి ఉంటుంది. కారులోని ప్రతి విషయాన్ని క్షణ్ణంగా, ప్రత్యేక శ్రద్ధతో తనిఖీ చేస్తారు. అంతేకా, సదరు సూపర్ కారుకు సంబంధించిన మునుపటి చరిత్ర మరియు సర్వీసింగ్ వంటి వివరాలను పారదర్శకంగా ఉంచుతారు.

ఫెరారీ నాణ్యతా ప్రమాణాలను తట్టుకునే కార్లను మాత్రమే కంపెనీ సర్టిఫై చేసి, అమ్మకాని ఉంచుతుంది. కాబట్టి, ఆ కార్లను కస్టమర్లు నిస్సందేహంగా కొనుగోలు చేయవచ్చు. ప్రీ-ఓన్డ్ కార్లపై రెండు సంవత్సరాల వారంటీ కవరేజ్‌తో పాటుగా, కార్ల నాణ్యతపై బ్రాండ్ నిబద్ధతలో భాగంగా అదే కాలానికి చెల్లుబాటు అయ్యే రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను కూడా ఫెరారీ అందిస్తోంది.
MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

ఫెరారీ అప్రూవ్డ్ విక్రయించే ప్రీ-ఓన్డ్ కార్లను, గడచిన 14 సంవత్సరాలలోపు రిజిస్టర్ చేయబడి ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. ఫెరారీ అప్రూవ్డ్ ప్రోగ్రాం ద్వారా విక్రయించే ఫెరారీ కార్లను క్షుణ్ణంగా పరీక్షించి, విక్రయిస్తారు. ఈ కార్ల కోసం టెస్ట్ క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా అందించడం జరుగుతుంది.

ఫెరారీ అప్రూవ్డ్ ప్రోగ్రాం ద్వారా విక్రయించే వాడిన కార్లపై ప్రత్యేక 2 సంవత్సరాల వారంటీని ఇప్పటివరకు ఐరోపాలో మాత్రమే అందించేవారు. తాజాగా, ఇప్పుడు ఈ సేవలను భారత్‌తో సహా ప్రపంచంలోని మరిన్ని ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
MOST READ:ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?

"ఫెరారీ ఆమోదించిన ప్రణాళికను మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త వారంటీ ప్రణాళికను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఫెరారీ మిడిల్ ఈస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జార్జియో టూరి అన్నారు.
"ఈ వారంటీ ప్లాన్ వినియోగదారులకు ఉత్తమ విలువను అందిస్తుంది. ఈ కార్యక్రమం మా వాడిన కార్లను కొనుగోలు చేసే వినియోగదారులకు మరింత విలువ మరియు మనశ్శాంతిని లభిస్తుందని" ఆయన అన్నారు.

భారత్‌లో ఫెరారీ ప్రీ-ఓన్డ్ కార్లపై అందిస్తున్న ప్రత్యేక వారంటీ స్కీమ్ పట్ల డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కోట్ల రూపాయల ఖరీదు చేసే ఫెరారీ సూపర్ కార్లలో సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయాలంటే చాలా మంది కస్టమర్లు సంకోచిస్తారు. ఇంత ఖరీదైన పాత వాహనాల్లో ఏదైనా సమస్య తలెత్తితే, ఆపై వచ్చే మరమ్మత్తు ఖర్చు కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, కస్టమర్ల కొనుగోలుకు భరోసా ఇచ్చేందుకు ఫెరారీ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక వారంటీ పథకం స్వాగతించదగినదిగా చెప్పుకోవచ్చు.