ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా మోటార్స్ భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో సుమో, సఫారీ వంటి అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన పాపులర్ మోడళ్లను విక్రయించిన సంగతి మనందరికీ తెలిసినదే. కాలక్రమంలో ఈ మోడళ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం టాటా నుండి లభిస్తున్నవి రెండే రెండు ఎస్‌యూవీలు. అవి: నెక్సాన్ మరియు హారియర్.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా నెక్సాన్ మరియు టాటా హారియర్ ఇవి రెండూ కూడా 5-సీటర్ వాహనాలే. భారత్ వంటి మార్కెట్లలో అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ హారియర్ ఎస్‌యూవీ ఆధారంగా ఓ కొత్త 7-సీటర్ వెర్షన్‌ను తయారు చేస్తోంది.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా గ్రావిటాస్ పేరుతో రానున్న ఈ కొత్త ఎస్‌యూవీ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆటో కార్ ఇండియా లీక్ చేసిన సమాచారం ప్రకారం, టాటా గ్రావిటాస్‌ను జనవరి 26, 2021వ తేదీన కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో దీని అమ్మకాలు మరియు డెలివరీలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని తొలిసారిగా కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పో కాన్సెప్ట్ వెర్షన్ రూపంలో ప్రదర్శించింది. గ్రావిటాస్ చూడటానికి హారియర్‌కు ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా అనిపిస్తుంది. హారియర్ కంటే గ్రావిటాస్ 62 మి.మీ ఎక్కువ పొడవును మరియు 80 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

ఈ పొడగించిన కొలతల కారణంగా, టాటా గ్రావిటాస్‌లో ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఫలితంగా, మూడవ వరుసలోని ప్రయాణీకులకు మరింత హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇందుకు తగినట్లుగా కంపెనీ దీని వెనుక డిజైన్‌లో భారీ మార్పులు చేసింది. కాకపోతే, ఈ రెండు మోడళ్ల వీల్‌బేస్ మాత్రం ఒకేలా (2741 మి.మీ) ఉంటుంది.

MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా హారియర్ మరియు టాటా గ్రావిటాస్ మోడళ్లలో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లలో స్వల్ప మార్పులు చేర్పుల మినహా ఇవి రెండూ ఒకేలో ఉండొచ్చని అంచనా. ఇలా చేయటం వలన గ్రావిటాస్ ఉత్పాదక వ్యయం తగ్గి, తక్కువ ధరకే దీనిని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

స్టాండర్డ్ హారియర్ మోడల్‌లో కనిపించే స్వాపింగ్ రూఫ్‌లైన్ గ్రావిటాస్‌లో మిస్ అవుతుంది. మూడవ వరుస ప్రయాణీకులకు ఎక్కువ హెడ్‌రూమ్‌ని అందించేందుకు ఈ మార్పు చేశారు. గ్రావిటాస్ మరియు హారియర్ మోడళ్లను ముందు వైపు నుంచి చూస్తే, రెండూ ఇంచు మించు ఒకే డిజైన్‌ను పోలి ఉన్నట్లు అనిపిస్తుంది.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

హారియర్‌లో కనిపించే లిఫ్ట్-అప్ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ స్థానంలో, గ్రావిటాస్‌లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. మిగిలిన అన్ని ఇంటీరియర్ ఫీచర్లు, పరికరాలు హారియర్ మోడల్ నుండే గ్రహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ సీటింగ్ కాన్ఫిగరేషన్లలో లభించవచ్చని తెలుస్తోంది.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా గ్రావిటాస్‌లో పొడగించిన బాడీ డిజైన్ కారణంగా పెరిగే అదనపు బరువు మరియు అదనపు వరుస సీటింగ్లను నిర్వహించడానికి, హారియర్‌తో పోలిస్తే గ్రావిటాస్‌లోని బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తుందని సమాచారం. ఇందులో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌తో పాటు నాలుగు చక్రాల్లో డిస్క్ బ్రేక్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా గ్రావిటాస్‌లో ఓ 4x4 వేరియంట్ కూడా విడదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఈ మోడల్ టాటా సుమో, సఫారీల మాదిరిగా ఆకట్టుకుంటుందా?

టాటా గ్రావిటాస్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఈ విభాగంలో ఇది ప్రధానంగా ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మోడల్‌కి పోటీగా ఉంటుంది. అలాగే, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మరి గ్రావిటాస్ కూడా సూమో, సఫారీ మాదిరిగా కస్టమర్లను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Tata Gravitas Prodcution Version To Be Unveiled Next Month, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X